Jr NTR: తారక్ త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ అలా ఉండనుందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అరవింద సమేత బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవగా ఈ కాంబినేషన్ లో మరో సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను అటు తారక్ ఇటు త్రివిక్రమ్ పూర్తి చేసిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో సినిమా తీస్తామని నిర్మాత నాగవంశీ తాజాగా మరోసారి స్పష్టం చేశారు.

హారిక హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై వరుసగా సినిమాలను నిర్మిస్తున్న నాగవంశీ టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా క్రేజ్ ను పెంచుకున్నారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా కోసం ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ కాంబినేషన్ లో మరో సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో చూడాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే చాలా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

పలు క్రేజీ ప్రాజెక్ట్ లలో (Jr NTR) తారక్ గెస్ట్ రోల్స్ లో కనిపిస్తారని జోరుగా ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో సైతం నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో మూవీ హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది. సినిమా సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ రేంజ్ పెరుగుతోంది.

తారక్ ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తుండగా అనిరుధ్ ఇప్పటికే ఈ సినిమా కోసం రెండు ట్యూన్స్ ను సిద్ధం చేశారని సమాచారం అందుతోంది. దేవర సినిమాకు సంబంధించిన షాకింగ్ అప్ డేట్స్ త్వరలో రానున్నాయని భోగట్టా. దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు చరిత్ర సృష్టించడంతో పాటు రికార్డులు తిరగరాయాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus