మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో మొదలుకానుంది. ఈ సినిమాలో మహేష్ రెండు పాత్రల్లో కనిపిస్తారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఒక పాత్రలో మహేష్ లుక్ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందని బోగట్టా.
వైరల్ అవుతున్న ఈ వార్తలకు సంబంధించి చిత్రయూనిట్ స్పష్టతనిస్తుందో లేదో చూడాల్సి ఉంది. ప్రస్తుత కాలంలో, పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో మహేష్ పాత్రలు ఉంటాయని మహేష్ బాబు పాత్రలు ప్రేక్షకులను అలరించేలా ఉండనున్నాయని తెలుస్తోంది. మహేష్ బాబుకు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తున్నారు. అల వైకుంఠపురములో సినిమా తర్వాత మహేష్ పూజా హెగ్డే కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో అతడు ఖలేజా తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ప్రస్తుతం త్రివిక్రమ్ వరుస విజయాలతో జోరుమీదున్నారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలతో పాటు త్రివిక్రమ్ రచనా సహకారం అందించిన సినిమాలు సైతం ఊహించని స్థాయిలో హిట్ అయ్యాయి. త్రివిక్రమ్ ఒక్కో సినిమాకు 30 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం విజయాలను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని త్రివిక్రమ్ పాన్ ఇండియా దర్శకునిగా గుర్తింపును సంపాదించుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. త్రివిక్రమ్ వేగంగా సినిమాలను తెరకెక్కించడం కంటే క్వాలిటీగా సినిమాలను తెరకెక్కించడంపై దృష్టి పెడుతున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.