టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో స్పిరిట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా 2024 సంవత్సరం జూన్ నెలలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ప్రభాస్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. సందీప్ రెడ్డి వంగా తన స్టైల్ లో ప్రభాస్ ను చూపించనున్నారని తెలుస్తోంది. 2025 సంవత్సరం ఫస్టాఫ్ లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది.
స్పిరిట్ మూవీ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని సమచారం అందుతోంది. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ప్రభాస్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసి ఈ సినిమాతో బిజీ కానున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి సక్సెస్ తో ఓవర్ నైట్ లో పాపులర్ అయ్యారు. ప్రస్తుతం యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి వంగా బిజీగా ఉండగా ఈ సినిమాతో ఆయన ఖాతాలో మరో సక్సెస్ చేరే అవకాశం ఉంది.
స్పిరిట్ మూవీ సక్సెస్ సాధించడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఛాన్స్ అయితే ఉందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సందీప్ రెడ్డి వంగా ఈ తరం యూత్ కు నచ్చే సినిమాలను ఎక్కువగా తెరకెక్కిస్తుండటం గమనార్హం. సందీప్ రెడ్డి వంగాను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
సందీప్ రెడ్డి వంగాకు కెరీర్ పరంగా మరిన్ని భారీ విజయాలు దక్కుతాయేమో చూడాల్సి ఉంది. భాషతో సంబంధం లేకుండా సందీప్ రెడ్డి వంగా సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ (Prabhas) పోలీస్ రోల్ లో కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు.