Prabhas, Trivikram: ప్రభాస్ త్రివిక్రమ్ కాంబో మూవీని ఆ రేంజ్ లో ప్లాన్ చేశారా?

ప్రభాస్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా తెరకెక్కలేదు. అయితే ఫ్యాన్స్ కోరుకుంటున్న క్రేజీ కాంబినేషన్లలో ఈ కాంబినేషన్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ప్రభాస్ కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ అదిరిపోయే స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని సమాచారం అందుతోంది. ప్రభాస్ త్రివిక్రమ్ కాంబో మూవీని భారీ రేంజ్ లో ప్లాన్ చేశారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మాస్ కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించాలని ఆయన ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.

మహేష్ సినిమాను పూర్తి చేసిన తర్వాత బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత ప్రభాస్ త్రివిక్రమ్ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ త్రివిక్రమ్ కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారనే సంగతి తెలిసిందే.

ఆదిపురుష్ జూన్ నెలలో రిలీజ్ కానుండగా సలార్ మూవీ సెప్టెంబర్ నెలలో థియేటర్లలో రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది జనవరి నెలలో ప్రాజెక్ట్ కే సినిమా థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఈ మూడు సినిమాల బడ్జెట్లు 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం అనే సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమాలకు 5000 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. ప్రభాస్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది.

ప్రభాస్ (Prabhas) ప్రతి ప్రాజెక్ట్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతుండటం ఫ్యాన్స్ సంతోషానికి కారణమవుతోంది. ప్రభాస్ గత సినిమాలు సాహో, రాధేశ్యామ్ ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఆ సినిమాలకు సంబంధించిన జరిగిన తప్పులు ఈ ప్రాజెక్ట్ ల విషయంలో రిపీట్ కావని బోగట్టా. ప్రభాస్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో తెలియాల్సి ఉంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus