‘ఆచార్య’లో స్పెషల్‌ సాంగ్‌కి స్టార్‌ కొరియోగ్రఫర్‌ అట

చిరంజీవి – రామ్‌చరణ్‌ కలసి ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే చాలు అనుకున్నప్పుడు ‘మగధీర’తో రాజమౌళి ఆ కోరిక తీర్చేశాడు. బాస్‌ రీఎంట్రీ ఇస్తున్నాడు కదా.. మరోసారి సేమ్‌ ఫీట్‌ అనుకున్నప్పుడు ‘బ్రూస్‌లీ’లో శ్రీను వైట్ల ఆ కోరిక నెరవేర్చాడు. ఇద్దరూ కలసి పాటకు స్టెప్పేస్తే బాగుండు అంటే ‘ఖైదీ నం 150’ వచ్చింది. ఇప్పుడు వన్స్‌మోర్‌ అని అడగకుండానే బిరియానీలా‘ఆచార్య’తో కొరటాల శివ ఆ పని చేసి పెడుతున్నాడు. దీనికి డబుల్‌ మసాలా జోడించబోతున్నారట. అదేనండి.. ఈ సినిమా చిరు – చరణ్‌ కలసి ఒక పాటకు స్టెప్పులేస్తారట. ‘ఖైదీ నం 150’లో స్టెప్పేసినా అది కాసేపే కదా. ఇప్పుడు ఫుల్‌ సాంగ్‌ అట.

‘ఆచార్య’ సినిమాలో చిరంజీవి – రామ్‌చరణ్‌ కాంబోలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ప్లాన్‌ చేస్తోందట చిత్రబృందం. ఇద్దరి పాత్రల నేపథ్యాల బట్టి చూస్తే ఇది ప్రత్యేక గీతమే అవుతుంది. అదే అయితే మరి ఇందులో ఇద్దరితో కలసి ఆడబోయేది ఎవరు అనేదే ఇప్పుడు ప్రశ్న. అయితే గతంలో ఈ సినిమాలో ఓ ఐటెమ్‌ సాంగ్‌ ఉందని.. అందులో రెజీనా ఉంటుందని వార్తలొచ్చాయి. అది ఇదేనా అనే ప్రశ్న వచ్చింది. అయితే ఈ పాట కోసం మరో స్టార్‌ హీరోయిన్‌ను తీసుకుంటారని వార్తలొస్తున్నాయి.

ఇక ఈ పాటకు కొరియోగ్రఫీ ఎవరు చేస్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. మామూలుగానే ఇద్దరూ సూపర్‌ డ్యాన్సర్‌లు. అలాంటి ఇద్దరికీ స్టెప్పులు ఇవ్వాలంటే ఓ రేంజిలో ఉండాలి. దాని కోసం స్టార్‌ కొరియోగ్రాఫర్‌ను తీసుకొచ్చే పనిలో ఉన్నారట. దీని కోసం బాలీవుడ్‌ నుండి ఎవరన్నా వస్తారా.. లేక మెగా ఫేవరేట్‌ లారెన్స్‌ మాస్టర్‌ను పిలుస్తారా అనేది చూడాలి. అయితే ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌కొరియోగ్రాఫర్‌లు చాలామందే వచ్చారు. చూద్దాం ఈ అవకాశం ఎవరికి దక్కుతుందో.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus