Indian 2: డింపుల్ కి సూపర్ ఛాన్స్.. ఏకంగా శంకర్ సినిమాలో..!

2017 లో వచ్చిన ‘గల్ఫ్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది డింపుల్ హయతి. అయితే ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో ‘జర్రా జర్రా’ అనే ఐటెం సాంగ్లో ఓ రేంజ్ మాస్ స్టెప్పులతో అలరించి సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. అటు తర్వాత ‘యురేకా’ అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించి మెప్పించింది. అయితే ఈమెకు తెలుగు, తమిళ భాషల్లో మంచి అవకాశాలే దక్కుతున్నాయి.

రవితేజ -రమేష్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన ‘ఖిలాడి’, విశాల్ హీరోగా తెరకెక్కిన ‘సామాన్యుడు’, ధనుష్ – అక్షయ్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘అత్రంగి రే’ గోపీచంద్- శ్రీవాస్ ల ‘రామబాణం’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కించుకుంది. కానీ ఆ సినిమాలు ఈమెకు ఆశించిన సక్సెస్ ను అందించలేదనే చెప్పాలి. అలా అని ఈమె క్రేజ్ అయితే తగ్గలేదు. డింపుల్ మంచి డాన్సర్. ఆమెకి ప్లస్ పాయింట్ అదే. అందుకే ఈమెకు ఏకంగా శంకర్ సినిమాలో నటించే ఛాన్స్ లభించిందని సమాచారం.

అందుతున్న సమాచారం ప్రకారం.. శంకర్ తెరకెక్కిస్తున్న (Indian 2) ‘ఇండియన్ 2 ‘ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందట. దీని కోసం డింపుల్ హయాతిని ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. సినిమాలో ఈ పాట స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందట. ఈ సాంగ్ కనుక క్లిక్ అయితే డింపుల్ కెరీర్ కి మరింత ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus