టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ మరియు ఆయన ఎదిగిన తీరు సంచలనం. చిరంజీవి తమ్ముడిగా వెండితెరకు పరిచయమైన పవన్ కళ్యాణ్ అన్నయ్యను అనుకరించకుండా తన ఓన్ మేనరిజం, స్టైల్ డెవలప్ చేసుకున్నాడు. మొదటి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీలోనే కొన్ని కఠిన సహసాలు చేసి తన ప్రత్యేకత చాటుకున్నాడు. అప్పట్లో పవన్ చేసిన సాహసాల గురించి జనాలు ప్రముఖంగా చెప్పుకున్నారు. ఆ మూవీ అబౌ యావరేజ్ గా నిలిచింది. ఆ తరువాత గోకులంలో సీత యావరేజ్, సుస్వాగతం సూపర్ హిట్ తొలిప్రేమ,బద్రి, తమ్ముడు, ఖుషి వరుస బ్లాక్ బస్టర్ హిట్స్. దీనితో పవన్ కళ్యాణ్ యూత్ లో భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. పవన్ క్రేజ్ అమాంతంగా ఆకాశానికి చేరింది.
ఈ సమయంలోనే పవన్ సొంత ప్రయోగానికి తెరలేపారు. తనకు రాని పనిని చేద్దాం అని ప్రయత్నించి చతికిల పడ్డాడు. ఖుషి మూవీ తరువాత పవన్ నుండి ఎలాంటి చిత్రం వస్తుందో అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో పవన్ జానీ టైటిల్ ప్రకటించారు. టైటిల్ కి విపరీతమైన స్పందన వచ్చింది. బక్క చిక్కిన శరీరంతో ఆల్మోస్ట్ బ్రూస్ లీ లా తయారయ్యాడు. ఈ లుక్ కి మిక్స్డ్ స్పందన లభించింది. మార్షల్ ఆర్ట్స్ బేస్డ్ మూవీ కావడంతో ఫ్యాన్స్ యాక్సప్ట్ చేశారు. స్టోరీ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే అన్నీ పవన్ కళ్యాణే. హీరోయిన్ తనతో పాటు బద్రిలో కలిసి నటించిన రేణు దేశాయ్ ని తీసుకున్నారు. రమణ గోగుల సంగీతం అందించారు.
ఫ్యాన్స్ భారీ అంచనాల మధ్య జానీ మూవీ ఏప్రిల్ 25 న 2003లో విడుదలైంది. మొదటి షో చూసిన ఫ్యాన్స్ నీరుగారి పోయారు. అసలు పవన్ నుండి ఆశించిన ఒక్క కోణం ఆ సినిమాలో లేదు. ముఖ్యంగా పవన్ లుక్ వెండి తెరపై చూడలేక పోయారు ప్రేక్షకులు. రేణు హీరోయిన్ కావడంతో ఆమెను కన్నాంబ కాలంనాటి హీరోయిన్ లా చూపించారు. దీనితో సినిమాలో గ్లామర్ లేకుండా పోయింది. ఇక స్లోగా సాగే ట్రాజిక్ సెంటిమెంటల్ స్టోరీ. అన్నీ కలిపి జానీ పవన్ కెరీర్ లోనే మొదటి భారీ అట్టర్ ప్లాప్ గా మిగిలింది. మళ్ళీ జల్సా మూవీ వచ్చే వరకు ఆయన వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నారు.
Most Recommended Video
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
సమంత బర్త్ డే స్పెషల్ : రేర్ అండ్ అన్ సీన్ పిక్స్ ..!