హాకీ ప్లేయర్ గా సందీప్ కిషన్ కుమ్మేశాడు భయ్యా..!

తెలుగు తమిళ ఇండస్ట్రీలో మంచి హీరోగా గుర్తింపు పొందిన సందీప్ కిషన్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ చేయడంలో దిట్ట. ప్రతి సినిమాలో విభిన్నమైన కథాంశాన్ని ఎంచుకుంటూ ప్రయోగాత్మకమైన సినిమాలే ఎక్కువగా చేస్తుంటాడు. అందుకే, సందీప్ కిషన్ సినిమాకి సపరేట్ లవర్స్ కూడా ఉన్నారు. ఈసారి ఎ1 ఎక్స్ ప్రెస్ అంటూ తన మార్క్ టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రయూనిట్. హాకి నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ ఇంకా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ హాకీ ప్లేయర్స్ గా కనిపించబోతున్నారు.

ట్రైలర్ ని మనం ఒక్కసారి చూసినట్లయితే, హాకీ క్రీడా నేపథ్యంలో సాగే కథ ప్రధానంగా కనిపిస్తోంది. ఇండియాలో ఇంకా సగం మంది హాకీ కోచ్ అంటే షారూఖ్ ఖానే అనుకుంటున్నారయ్యా అంటూ రావ్ రమేష్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. సందీప్ కిషన్ తో పాటుగా , లావణ్య త్రిపాఠి కూడా హాకీ ప్లేయర్ గా కనిపిస్తోంది. స్పోర్ట్స్ అకాడమీలో పాలిటిక్స్ ఎలా ఉంటాయో ఈసినిమాలో కళ్లకి కట్టినట్లుగా చూపించబోతున్నట్లుగా ట్రైలర్ చూస్తుంటే అర్ధం అవుతోంది. మనదేశంలో స్పోర్ట్స్ మాన్ కి ఇంకా ఇవ్వాల్సిన కనీస రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు సార్. అంటూ సందీప్ కిషన్ ఎమోషనల్ గా డైలాగ్ చెప్తున్నాడు.

ఇక్కడ స్టేడియంలో గేమ్ ఆడటం, సందీప్ కిషన్ స్టైల్ గా క్రాఫ్ ని పైకి అనడం ట్రైలర్ లో హైలెట్ గా నిలుస్తున్నాయి. గేమ్ ఆడాలంటేనే ఎంతో కొంత డబ్బులు ఇవ్వాల్సొస్తోంది అంటూ అకాడమీల్లో ఉన్న అవినీతిని బయటపెట్టేదిలా ఈ మూవీ కనిపిస్తోంది. ఓవర్ ఆల్ గా సందీప్ కిషన్ తన మార్క్ యాక్టింగ్ ని మరోసారి ప్రేక్షకులకి ఈ సినిమా ద్వారా చూపించబోతున్నాడు. ఫిబ్రవరిలో ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోందని ట్రైలర్ లాస్ట్ లో ఎనౌన్స్ చేశారు. అంతేకాదు, సిక్స్ ప్యాక్ తో సందీప్ కిషన్ ఒక రేంజ్ లో కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఈ ట్రైలర్ ట్రెండింగ్ 1 లో దూసుకుపోతోంది. మరి మీరు కూడా ఒక లుక్కేయండి.


ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus