Aadhi, Nikki: ఆది పినిశెట్టి నిక్కీ గల్రానీల ప్రేమ పెళ్లి కథ తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో పాత్రల్లో, విలన్ పాత్రల్లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆది పినిశెట్టి సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్న నటులలో ఆది పినిశెట్టి ఒకరు కావడం గమనార్హం. ది వారియర్ సినిమాలో ఆది పినిశెట్టి అద్భుతమైన నటనను క్రిటిక్స్ సైతం మెచ్చుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానీల వివాహం జరిగిందనే సంగతి తెలిసిందే.

తాజాగా ఆది పినిశెట్టి తన ప్రేమపెళ్లి కథ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. సినిమాలో నేను హైలెట్ అయ్యానంటే అది రామ్ గొప్పదనం అని ఆది పినిశెట్టి తెలిపారు. రామ్ కొంచెం తగ్గడం వల్ల తన పాత్రకు మరింత మంచి గుర్తింపు వచ్చిందని ఆది పినిశెట్టి తెలిపారు. నాన్న నాలో పాజిటివ్ పాయింట్ల కంటే నెగిటివ్ పాయింట్ల గురించి ఎక్కువగా చెబుతారని ఆది పినిశెట్టి చెప్పుకొచ్చారు.పెళ్లికి ముందు పెళ్లి తర్వాత సేమ్ లైఫ్ అని ఆది పినిశెట్టి కామెంట్లు చేశారు.

మలుపు మూవీలో నేను, నిక్కీ గల్రానీ తొలిసారి కలిసి నటించామని ఆది పినిశెట్టి చెప్పుకొచ్చారు. ఆ సమయానికి మా ఇద్దరి మధ్య స్నేహం కూడా లేదని ఆయన వెల్లడించారు. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మేమిద్దరం ఎడమొహం పెడమొహంలా ఉండేవాళ్లమని ఆది పినిశెట్టి చెప్పుకొచ్చారు. మలుపు మూవీ షూట్ పూర్తయ్యే సమయానికి మా ఇద్దరి మధ్య ఫ్రెండ్ షిప్ మొదలైందని ఆదిపినిశెట్టి పేర్కొన్నారు.

మా ఇద్దరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారిందని ఆది పినిశెట్టి తెలిపారు. నిక్కో మొదట ప్రపోజ్ చేసిందని నేను ఇంట్లో చెప్పగా అంగీకరించారని ఆది పినిశెట్టి పేర్కొన్నారు. పెళ్లయ్యాక సినిమాల విషయంలో తన ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తున్నానని ఆది పినిశెట్టి చెప్పుకొచ్చారు. నటన విషయంలో నిక్కీని బలవంతం చేయలేదని ఆది అన్నారు. ఆది చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus