Aadhi Pinisetty, Nikki Galrani: పెళ్లి చేసుకోబోతున్న మరో టాలీవుడ్ హీరో..?

టాలీవుడ్ లో నటిగా పలు సినిమాలు చేసిన సంజన గల్రానీ తన చెల్లెలు నిక్కీ గల్రానీని హీరోయిన్ గా పరిచయం చేసింది. నటిగా తన అక్క కంటే మంచి పేరు తెచ్చుకుంది నిక్కీ. కానీ ఆశించిన స్థాయిలో ఈ అక్కాచెల్లెళ్లు పాపులర్ అవ్వలేకపోయారు. టాలీవుడ్ లో అయితే వీరికి అవకాశాలు కూడా లేవు. నిక్కీకి మాత్రం తమిళంలో అరకొర అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా తన దగ్గర పనిచేసే వ్యక్తి దొంగతనం చేశాడని పోలీసులను ఆశ్రయించింది నిక్కీ గల్రానీ.

Click Here To Watch NEW Trailer

ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. అది కూడా ఓ టాలీవుడ్ హీరోని అని తెలుస్తోంది. అతడు మరెవరో కాదు.. ఆది పినిశెట్టి. ఇతడు తెలుగులో ‘గుండెల్లో గోదారి’, ‘నిన్ను కోరి’, ‘సరైనోడు’, ‘రంగస్థలం’, ‘అజ్ఞాతవాసి’ వంటి చిత్రాల్లో నటించాడు. అతడికి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడే ఆది పినిశెట్టి. కొన్నాళ్లుగా ఆది, నిక్కీలు ప్రేమించుకుంటున్నట్లు వార్తలో వస్తున్నాయి.

వీరిద్దరూ కలిసి ‘మలుపు’ అనే సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ లో బాగా క్లోజ్ అయ్యారని.. కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో వీరు తమ బంధాన్ని మరో మెట్టు ఎక్కించాలని నిర్ణయించుకున్నట్లుగా కోలీవుడ్ మీడియా వార్తలు ప్రచురిస్తోంది. 2020 జూలైలో ఆది ఇంట్లో జరిగిన ఓ వేడుకకు కూడా నిక్కీ గల్రానీ హాజరైంది. ఆ తరువాత ఇద్దరూ కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. దీంతో వీరి ప్రేమ విషయం నిజమనే నమ్ముతున్నారంతా.

ఇప్పుడు ఈ జంట పెళ్లి చేసూకోబోతున్నారని.. వీరితో సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి తెలిపారని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం వీరి నిశ్చితార్ధానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. త్వరలోనే పెళ్లి డేట్ ని ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు అటు నిక్కీ గానీ.. ఇటు ఆది కానీ ఈ విషయంపై స్పందించలేదు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus