ఉగాదికి ప్రారంభం కానున్న ఆది సాయి కుమార్, భాస్కర్ బంటు పల్లి ల సినిమా..!!!

వరుస హిట్ లతో ఫుల్ జోష్ లో ఉన్న హీరో ఆది సాయి కుమార్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. భాస్కర్ బంటు పల్లి ఈ సినిమా కి కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం అందిస్తున్నారు. ఫామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమా లో ఆది సరికొత్త క్యారక్టరైజేషన్ తో , సరికొత్త స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నారు..

శిఖర క్రియేషన్స్ పతాకంపై టి. విజయకుమార్ రెడ్డి సమర్పిస్తుండగా గుడివాడ యుగంధర్ ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.సాకేత్ కొమండూరి సంగీతం సమకూరుస్తుండగా A. D.మార్గల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే సినిమా పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. కాగా ఈ ఉగాది పండగను పురస్కరించుకుని ఏప్రిల్ 13 న సినిమా ప్రారంభోత్సవం చేయనున్నారు.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus