సాయి కుమార్ తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయి కుమార్(Aadi Saikumar). ‘ప్రేమకావాలి’ తో అతను హీరోగా డెబ్యూ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నారు. అటు తర్వాత ‘లవ్ లీ’ అనే సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. ఆ రెండు సినిమాలతోనూ ఆదికి మంచి మార్కెట్ ఏర్పడింది. కానీ తర్వాత మాస్ ఇమేజ్ పై మనసు పారేసుకుని పరాజయాలు చవి చూశాడు. దాని వల్ల అతని కెరీర్.. ఇబ్బందిలో పడింది. వరుస సినిమాలు చేసినప్పటికీ.. అతన్ని ప్లాపులు వెంటాడాయి.
ఆ తర్వాత అతని సినిమాలు ఏవి వచ్చాయో.. ఏవి వెళ్ళిపోయాయి? అనే విషయాలు కూడా తెలీదు అంటే ఆది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఆల్మోస్ట్ ఆదిని మర్చిపోతున్నారు ఆడియన్స్ అనుకునే టైంలో ‘శంబాల’ వచ్చింది. భారీ పోటీలో రిలీజ్ అయినప్పటికీ.. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్ళని రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. మరి ఆది గాడిలో పడ్డట్టేనా? అనే డౌట్ చాలా మందిలో ఉంది.
‘శంబాల’ అనేది ఆదికి కంబ్యాక్ మూవీనే కాదు.. స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో అతనికి మంచి లెసన్ నేర్పించిన సినిమా కూడా..! ఎందుకంటే.. ఆది తన ఇమేజ్ కి తగ్గట్టు ఫ్యామిలీ సినిమాలు చేసుకున్నన్నాళ్లు ఇబ్బంది ఎదురవ్వలేదు. కానీ మాస్ ఇమేజ్ కోసం యాక్షన్ సినిమాలు చేయడం మొదలుపెట్టినప్పటి నుండి.. రిజల్ట్స్ తేడా కొట్టాయి. ‘శంబాల’ అనేది మైథలాజికల్ టచ్ ఉన్న మిస్టికల్ థ్రిల్లర్. ఇలాంటి కథలకి ఆది సెట్ అవుతాడు అని ఈ సినిమా ప్రూవ్ చేసింది.
దీన్ని ఆది గమనించాలి. ప్రస్తుతం అతను శ్రీధర్ రెడ్డి అనే నూతన దర్శకుడికి ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అతను కొత్త దర్శకుడే.. కానీ టాలెంటెడ్ అని ఇండస్ట్రీలో చెబుతుంటారు.ఆది ఇమేజ్ కి తగ్గట్టు ఓ మంచి కథని అతను రెడీ చేశాడట. ‘సగిలేటి కథ’ ఫేమ్ అశోక్ ఈ ప్రాజెక్టుని నిర్మించే అవకాశాలు ఉన్నాయి.
