ఆది ‘శశి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

ఆది సాయికుమార్ హీరోగా సురభి హీరోయిన్ గా శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం ‘శ‌శి’. ‘శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్’ ప‌తాకంపై ఆర్‌.పి. వ‌ర్మ‌, సి. రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాసరావు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 19న ఈ చిత్రం విడుదల కాబోతోంది. కీల‌క‌పాత్రలో హీరోయిన్ రాశీ సింగ్ కూడా నటించింది.అరుణ్ చిలువేరు సంగీతంలో రూపొందిన ‘ఒకే ఒక లోకం’ అనే పాట సినిమా పై ఏర్పడేలా చేసింది. దాంతో ఈ మధ్య కాలంలో హిట్టు లేకపోయినా ఆది నటించిన ఈ చిత్రానికి మంచి బిజినెసే జరగడం విశేషం.

ఆ వివరాలను ఓ సారి పరిశీలిస్తే :

నైజాం  1.00 cr
సీడెడ్  0.50 cr
ఉత్తరాంధ్ర  1.50 cr
ఏపీ+తెలంగాణ (టోటల్)  3.00 cr
రెస్ట్ ఆఫ్ ఇంఫియా + ఓవర్సీస్  0.20 cr
వరల్డ్ వైడ్ టోటల్ 3.20 cr

‘శశి’ చిత్రానికి 3.2కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 3.5కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పోటీగా ‘చావు కబురు చల్లగా’ ‘మోసగాళ్ళు’ వంటి చిత్రాలు కూడా విడుదలవుతున్నాయి. వీటితో పాటు బ్లాక్ బస్టర్ ‘జాతి రత్నాలు’ జోరు ఇంకా తగ్గలేదు. కాబట్టి పాజిటివ్ టాక్ కనుక రాకపోతే.. ‘శశి’ ని ప్రేక్షకులు పట్టించుకుంటారన్న గ్యారెంటీ లేదు. అయితే ప్లాపుల్లో ఉన్న రవితేజ, అల్లరి నరేష్ లు ఈ ఏడాది హిట్టు కొట్టినట్టు.. ఆది కూడా హిట్ అందుకునే మిరాకిల్ ఏమైనా జరుగుతుందేమో చూడాలి.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus