Srikanth N Reddy: త్రివిక్రమ్‌ మార్పులు చెప్పారు… వైష్ణవ్‌ అవేం చెప్పలేదు: ‘ఆదికేశవ’ డైరక్టర్‌

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దగ్గరకు ఓ కథ వెళ్లి.. ఆయన చూసి మార్పులు చెప్పిన తర్వాత సినిమాగా మారింది అంటే ఆ కథలో ఏదో కొత్త పాయింట్‌ ఉండే ఉంటుంది. అలాంటి పాయింట్‌తో తెరకెక్కిన చిత్రం ‘ఆదికేశవ’. ఎన్నో వాయిదాల తర్వాత ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమా గురించి, తన దగ్గర ఉన్న మరో ఆసక్తికర కథ గురించి చెప్పుకొచ్చారు. ఆ కొత్త కథే ఇప్పుడు వైరల్‌ పాయింట్‌.

శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి పెద్ద తెరకు కొత్తేమో కానీ… షార్ట్‌ ఫిల్మ్‌ లవర్స్కు ఆయన ఇప్పటికే పరిచయం. కామెడీ పాళ్లు ఎక్కువగా ఉండే షార్ట్‌ ఫిల్మ్స్‌ ఆయన తెరకెక్కించి, మెప్పించారు కూడా. వెండితెరకు రావడానికి కూడా అవే కారణం అని చెప్పాలి. నిజానికి సిల్వర్‌ స్క్రీన్‌లో కూడా ఓ మంచి ప్రయోగాత్మక కామెడీ కథతోనే రావాలని అనుకున్నారట. అందుకు తగ్గట్టుగా ఓ కథను సిద్ధం చేసుకున్నారట. కానీ స్నేహితులు, సన్నిహితుల సూచనలతో కమర్షియల్‌ సినిమా చేశారట.

అయితే తాను రాసుకున్న ఎక్స్‌పెరిమెంటల్‌ స్టోరీలో హీరోకు రెండు మెదళ్లు ఉంటాయట. ఆ పాయింట్‌ విని చాలామంది తొలి సినిమా కమర్ష కానీ కొద్దిమంది సన్నిహితులు ఈ కథ వద్దు, కమర్షియల్‌ సినిమాతో వెళ్లు అని అనడంతో ‘ఆదికేశవ’ కథ సిద్ధం చేశారట. త్రివిక్రమ్‌ ఈ కథని విన్నాక కొన్ని మార్పులు చెప్పారట. అలాగే వైష్ణవ్‌కు చెప్పినప్పుడు చేయడానికి సమయం తీసుకున్నాడని చెప్పారు శ్రీకాంత్‌. అయితే కథ, కథనాలపై తొలుత నుండి చాలా నమ్మకంగా ఉన్నారట.

సుధీర్‌ వర్మ దగ్గర కొన్ని సినిమాలకు (Srikanth N Reddy) శ్రీకాంత్‌ సహాయ దర్శకుడిగా పని చేశారు. తన రూమ్‌ మేట్‌ కమెడియన్‌ సుదర్శన్‌ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా ఓ సినిమా చేయాలనుకున్నారట శ్రీకాంత్‌. స్క్రిప్ట్‌ను కూడా సిద్ధం చేశారట. అయితే మరి రెండు మెదళ్ల స్టోరీ, సుదర్శన్‌ కథ ఒకటేనా అనేది తెలియాల్సి ఉంది.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus