వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన ఆదికేశవ మూవీ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. మాస్ ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించే అవకాశం ఉన్నా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆదికేశవ బుకింగ్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేవు. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన స్టార్ మా ఛానల్ కొనుగోలు చేయగా ఈ సినిమా డిజిటల్ హక్కులను మాత్రం నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.
ఆదికేశవ (Aadikeshava) మూవీ రిలీజైన ఆరు వారాలకు అటూఇటుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెట్ ఫ్లిక్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ సంఖ్యలో తెలుగు సినిమాలను కొనుగోలు చేస్తుండటం గమనార్హం. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు ఒకింత భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాను నిర్మించారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. వైష్ణవ్ తేజ్ కోరుకున్న భారీ హిట్ ను మాత్రం ఈ సినిమా అందించడం కష్టమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.
వైష్ణవ్ తేజ్ తర్వాత ప్రాజెక్ట్ లతో పాన్ ఇండియా హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ కు కథల విషయంలో సాయితేజ్ సాయం చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. వైష్ణవ్ తేజ్ రెమ్యునరేషన్ ఒకింత పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. వైష్ణవ్ తేజ్ క్రేజ్ ను మరింత పెంచుకుని సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
వైష్ణవ్ తేజ్ కథ అద్భుతంగా ఉంటే మల్టీస్టారర్ సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో వైష్ణవ్ తేజ్ కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!
స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!