తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ఆకాశం నీ హద్దరా మూవీ అనేక అవాంతరాలు దాటి తాజాగా ఓటీటీ ద్వారా విడుదల అయిన సంగతి తెలిసిందే. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుకుంటోంది. సింప్లి ఫ్లయ్ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. కేవలం ధనికులే కాదు సామాన్యులు కూడా ప్లయిట్ ఎక్కాలని, అందుకోసం ప్లయిట్ టిక్కెట్ దరను అందరికీ అందుబాటులోకి తీసురావాలనే హీరో కలను ఎలా నెరవేర్చుకున్నాడనేది కథ.
ఇక ఈ చిత్రంలో చాలా కాలంగా విజయం కోసం ఎదురు చూస్తున్న సూర్యకు కరెక్ట్ టైమ్‌లో ఓ సూపర్ డూపర్ బ్లాక్‌బస్టర్ హిట్ వచ్చిందని చెప్పొచ్చు. సరైన కథ పడితే తనలోని నటుడు ఏరేంజ్‌లో హద్దులు దాటుతాడో సూర్య ఈ మూవీతో మరోసారి నిరూపించాడు. సూర్య నటనకు తోడు, ఓ సంక్షష్టమైన కథను ఎంతో చాకచక్యంగా సింప్లిఫై చేసి ప్రెజెంట్ చేసిన దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వ ప్రతిభ సినీ ప్రియుల్ని అమితంగా మెప్పిస్తుంది.
ఈ సినిమాలో హీరో కలతో ప్రతిఒక్కరు కనెక్ట్ అయ్యేలా బ్యాక్‌స్టోరీని పర్‌ఫెక్ట్‌గా డిజైన్ చేసుకుంది దర్శకురాలు సుధ కొంగర. ఓ సామాన్యుడుకి అసాధ్యమైన కల ఎలా సాధ్యమవుతుందనే దానికి ఉదాహరణగా హీరో చెప్పిన ఉడిపి హోటల్ దోశ సీన్ సగటు ప్రేక్షకుడు కూడా కన్విన్స్ అయ్యేలా ఉంటుంది. హీరో కలకి సంబంధించి ఎమోషన్‌తో మనం కూడా ట్రావెల్ చేసేందుకు ఇలాంటి పలు సన్నివేశాలతో పాటు లవ్‌స్టోరీని కూడా ప్యార్లర్‌గా డిజైన్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది.
స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్స్ రాయడంలో ముందుండే సుధ కొంకర, ఈ సినిమాలో కూడా ఇది సాధ్యమేనా అనిపించే కల కంటున్న భర్తకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసే భార్య పాత్రను బాగా డిజైన్ చేసింది. ఇక ఆ పాత్రలో అపర్ణ బాలమురళి నటన ఆకట్టుకోవడంతో పాటు, సూర్య- అపర్ణల మధ్య కెమిస్ట్రీ వావ్ అనిపించేలా ఉంది. ఇంత వరకు బాగానే ఉన్నా కొన్ని పాత్రల పై ఈ దర్శకురాలు ఫోకస్ పెట్టలేదనిపిస్తోంది.
బాలీవుడ్ సీనియర్ నటుడు పరేష్ రావల్‌ను ఓ రెగ్యులర్ కార్పోరేట్ విలన్‌గా చూపించడమే కాకుండా, హీరోకి విలన్‌కి మధ్య సన్నివేశాలు అంత క్రియేటివిటీగా ఉండకపోవడంతో, ఓ సాధారణ కమర్షియల్ మూవీ సీన్స్‌ను గుర్తుకు తెస్తాయి. ఇక మరో ముఖ్యమైన క్యారెక్టర్ స్టార్టింగ్‌లో ఉన్న ఇంపార్టెన్స్ ఆ తర్వాత పెద్దగా కనిపించదు. మోహన్ బాబు లాంటి సీనియర్ అండ్ క్రేజ్ ఉన్న నటుడుని లైట్ తీసుకోవడం ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడు అదే ఈ సినిమాలో మైనస్‌గా చెప్పొచ్చని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అయితే సినిమా హిట్ అవడంతో ఇలాంటి చిన్న చిన్న మైనస్‌లు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Most Recommended Video
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!