హీరోయిన్ల విషయంలో నొ కాంప్రమైజ్ అంటున్న ఆకాష్ పూరి..!

ఈ మధ్య కాలంలో సరైన హిట్టు కొట్టాలని భావించిన కుర్ర హీరోలు.. కథ పైన కాకుండా క్రేజ్ లో ఉన్న కథానాయికల పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని చెప్పాలి. ఆ హీరోయిన్లకు ఉన్న క్రేజ్ తో సినిమా పై హైప్ రావడం గ్యారంటీ అని భావించి వాళ్లకు ఫ్యాన్సీ రెమ్యూనరేషన్ చెల్లించి అయినా సరే.. వాళ్లనే ఎంపిక చేసుకోవాలంటూ దర్శకనిర్మాతలను డిమాండ్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అఖిల్ వంటి హీరోలు ఆల్రెడీ ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు.

మెయిన్ గా శ్రీనివాస్ సినిమాలో కచ్చితంగా క్రేజ్ లో ఉన్న హీరోయిన్ ఉండాల్సిందే. ఇక అఖిల్ అయితే కెరీర్ ప్రారంభంలో కొత్త హీరోయిన్లతో పనిచేసాడు కానీ ఇప్పుడైతే క్రేజ్ లో ఉన్న హీరోయిన్లే కావాలంటున్నాడట. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మన పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి కూడా చేరాడు. అవును ఇతని నెక్ట్ సినిమాలో హీరోయిన్ గా ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టిని ఎంపిక చేసుకున్నారట. ఈ విషయంలో దర్శకనిర్మాతల పై ఆకాష్ పూరి కూడా ఒత్తిడి చేసినట్టు తెలుస్తుంది.

దాదాపు ఈమె ఖరారైపోయినట్టే అనే టాక్ బలంగా వినిపిస్తుంది. ‘ఉప్పెన’ ట్రైలర్ లో కృతి శెట్టిని చూసిన ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఆ సినిమాని చూస్తామా అన్నట్టు ఎదురుచూస్తున్నారు. మొదటి సినిమా విడుదల కాకుండానే ఈమె నాని వంటి స్టార్ హీరో సినిమాలో కూడా ఎంపికయ్యింది. ఈమె క్రేజ్ ను గ్రహించి ఆకాష్ పూరి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus