‘లాల్ సింగ్ చడ్డా’ తెలుగు ట్రైలర్ చూశారా? ఆదివారం చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా వేదిక మీద జరిగిన ఓ సన్నివేశం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ షికారు చేస్తున్నాయి. అంతలా ఏం జరిగిందబ్బా అనుకుంటున్నారా? ‘లాల్’ అలియాస్ ఆమిర్ ఖాన్, ‘వీరయ్య’ అలియాస్ చిరంజీవి ఆ వేదిక మీద పానీ పూరి తిన్నారు. అదేంటి అంత పెద్ద స్టేజీ మీద పానీ పూరి తిన్నారా అనుకుంటున్నారా? అవును, తినడంతోపాటు కొన్ని కామెంట్లకు ఆన్సర్ కూడా చెప్పారు.
‘లాల్ సింగ్ చడ్డా’ ట్రైలర్‌లో ఓ సన్నివేశం ఉంటుంది. జీవితం – పానీ పూరిని లింక్ పెట్టి లాల్ ఓ డైలాగ్ చెబుతూ తింటాడు. అయితే ఆ సీన్ ట్రైన్ రన్నింగ్‌లో జరుగుతుంది. ట్రైన్‌లో పానీ పూరి ఏంటి అని కొంతమంది కామెంట్లు చేశారు. దానికి ఆన్సర్ ఇద్దాం అనుకున్నారో లేక తినాలని అనిపించిందో కానీ.. స్టేజీ మీద పానీ పూరి తెప్పించుకుని మరీ ఇద్దరూ తిన్నారు. వెంటనే అక్కడున్న ఫొటో గ్రాఫర్ ఆ సీన్‌ని క్లిక్‌మనిపించారు. ఏముంది వెంటనే ఆ పిక్స్ వైరల్ అయిపోయాయి.
ఇక ఈ సినిమా ఈవెంట్‌కి చిరంజీవి ఎందుకు వచ్చారో మీకు తెలసే ఉంటుంది. ఈ సినిమాను తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్నారు. గీతా ఆర్ట్స్ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేస్తోంది. దీంతో చిరంజీవి వరుసగా సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ ట్విటర్‌లో ట్వీట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. ఆగస్టు 11న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇందులో నాగచైతన్య కూడా నటించిన విషయం తెలిసిందే.
మన సినిమాలు బాలీవుడ్‌కి వెళ్లి మంచి విజయం అందుకుంటున్న నేపథ్యంలో ఆమిర్ తన కలల ప్రాజెక్ట్‌ను అన్ని రాష్ట్రాలకు విస్తరింపజేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల చిరంజీవికి ప్రత్యేక ప్రివ్యూ వేసి మరీ చూపించారు. రాజమౌళి, సుకుమార్, నాగార్జున కూడా ఈ ప్రివ్యూకి విచ్చేశారు. ఆ తర్వాత చిరంజీవి ఈ సినిమాను సమర్పిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ‘ఫారెస్ట్ గంప్’ సినిమాకు ఇది రీమేక్. అయితే ఇందులో చాలా మార్పులు చేశామని ఆమిర్ చెప్పాడు.
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!