Baahubali, Animal: యానిమల్ పై ఫైర్ అయిన అమీర్ ఖాన్ భార్య.. సందీప్ జవాబిదే!

గతేడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో యానిమల్ సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. అయితే ఓటీటీలో ఈ సినిమా విడుదలైన తర్వాత ఎక్కువగా నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. ప్రముఖ సెలబ్రిటీలు ఈ సినిమా గురించి నెగిటివ్ గా స్పందిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు యానిమల్ సినిమా గురించి స్పందిస్తూ బాహుబలి2, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలు స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ కామెంట్లు తన దృష్టికి రావడంతో సందీప్ రెడ్డి వంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. కిరణ్ రావు పేరు ప్రస్తావించకుండానే సందీప్ రెడ్డి వంగా చురకలు అంటించారు. నేను ఆమెకు ఒకటే చెప్పాలనుకుంటున్నానని ఆమె అమీర్ ఖాన్ ను వెళ్లి అడగాలని పేర్కొన్నారు. అమీర్ ఖాన్ నటించిన దిల్ సినిమాలో అమ్మాయిపై దారుణంగా ప్రవర్తించే పరిస్థితిని సృష్టించారని సందీప్ పేర్కొన్నారు.

ఆ తర్వాత సినిమాలో అమ్మాయే తప్పుగా బిహేవ్ చేసినట్టు చేస్తాడని చివరికి (Aamir Khan) అమీర్ ఖాన్ తోనే ఆమె ప్రేమలో పడుతుందని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చారు. మరి ఇదంతా ఏంటని ఇలాంటివి తెలుసుకోకుండానే మాపై ఎలా దాడి చేస్తారో అర్థం కావడం లేదని సందీప్ రెడ్డి వంగా కామెంట్లు చేశారు. సందీప్ రెడ్డి వంగా చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

సందీప్ రెడ్డి వంగా తర్వాత మూవీ స్పిరిట్ అనే టైటిల్ తో తెరకెక్కుతుండగా ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా తన సినిమాలకు తనే నిర్మాతగా వ్యవహరిస్తూ కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందుకుంటున్నారు. సందీప్ రెడ్డి వంగా కెరీర్ పరంగా అంతకంతకూ ఎదుగుతున్నారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus