Aamir Khan: ఆమిర్‌ ఖాన్‌ కొత్త సినిమా ఫిక్స్‌… ఆ రీమేక్‌ వదిలేసినట్లేనా?

ఒక సినిమా విజయం కంటే.. ఫ్లాప్‌ అందులోనూ అట్లర్‌ ఫ్లాప్‌ ఎక్కువ పాఠాలు నేర్పిస్తుంది అంటారు. అంతా బాగున్నప్పుడు కంటే.. ఏదీ సరిగ్గా లేనప్పుడే అసలు సమస్యలు బయటకు వస్తాయి కదా. అలా ఆమిర్‌ ఖాన్‌కు కూడా అసలు విషయంలో క్లారిటీ వచ్చింది అని చెబుతున్నారు. ఆ అట్టర్‌ ఫ్లాపే… ‘లాల్‌ సింగ్‌ చడ్డా’. ఎంతో ఇష్టపడి, ప్రేమించి, కష్టాలు దాటి ఆమిర్‌ ఖాన్‌ చేసిన సినిమా అది. అయితే బాక్సాఫీసు దగ్గర ఘోరంగా విఫలమైంది. ‘ఫారెస్ట్‌ గంప్‌’ సినిమాకు రీమేక్‌గా చేసిన ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ తర్వాత ఆమిర్‌ మరో స్పానిష్‌ మూవీ రీమేక్‌ చేయాలని అనుకున్నాడు.

దాని గురించి ‘లాల్‌ సింగ్‌…’ ప్రచారం సమయంలో చెప్పాడు కూడా. అయితే ఇప్పుడు ఆమిర్‌ మనసు మారింది అంటున్నారు. ఆ సినిమాను పక్కన పెట్టేసి వేరే సినిమాను ఓకే చేశాడట. అది కూడా గతంలో ఆయన చేసిన సినిమాకు దగ్గరగా ఉండే సినిమానే. ఆ సినిమానే ‘తారే జమీన్‌ పర్‌’. ఇప్పుడు చేయబోతున్నది ‘సితారే జమీన్‌ పర్‌’. ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ సినిమా ఆమిర్‌ ఖాన్‌ ఆలోచనలు బాగా మారిపోయాయి అంటూ ఈ మధ్య బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.

వాటిని నిజం చేస్తూ.. ‘సితారే జమీన్‌ పర్‌’ అనే చిత్రంలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమిర్‌ మాట్లాడుతూ.. ‘సితారే జమీన్‌ పర్‌’ అనే సినిమా తన కల్ట్‌ క్లాసిక్‌ మూవీ ‘తారే జమీన్‌ పర్‌’ తరహాలో ఉంటుందని చెప్పుకొచ్చాడు. ‘తారే జమీన్‌ పర్‌’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది… ఆ చిత్రం చాలామందిని ఏడిపించింది. అయితే ఇప్పుడు రాబోయే ‘సితారే జమీన్‌ పర్‌’ ఆ సినిమాకు రివర్స్‌లో అందరినీ నవ్విస్తుంది ఆమిర్‌ చెప్పుకొచ్చారు.

రెండు సినిమాల థీమ్‌ ఒక్కటే అని… కానీ చిన్న మార్పు మొత్తం సినిమాను కొత్తగా చూపిస్తుంది అని తెలిపారు. అందుకే పేరును అలా పెట్టామని కూడా చెప్పారు. మనలో అందరికీ లోపాలు, బలహీనతలు ఉంటాయి. అదే విధంగా ప్రతి వ్యక్తిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ విషయాన్నే ఈ సినిమాలో చూపిస్తున్నాం. ‘తారే జమీన్‌ పర్‌’ చిత్రంలో ఇషాన్‌కి ఆమిర్‌ పాత్ర సాయం చేస్తుంది. కానీ ఇందులో ఆమిర్‌కు ఇషాన్‌ అనే పాత్ర సాయం చేస్తుంది అంటున్నారు (Aamir Khan) ఆమిర్‌. అదెలా అనేది సినిమాలో చూడాలి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus