Aamir Khan: కూతురి పెళ్లి డేట్ అనౌన్స్ చేసిన ఆమిర్ ఖాన్!

బాలీవుడ్ స్టార్ హీరో.. అభిమానులు మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలుచుకునే ఆమిర్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండియాలోనే కాకుండా చైనా,దుబాయ్ వంటి దేశాల్లో కూడా ఆమిర్ ఖాన్ సినిమాలకి మంచి డిమాండ్ ఉంటుంది. ‘దంగల్’ సినిమా చైనాలో కూడా వెయ్యి కోట్లకి పైగా వసూల్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఆమిర్ ఖాన్, సినిమాలతోనే కాకుండా వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటాడు.

అతను మొన్నామధ్య రెండో భార్యకి కూడా విడాకులు ఇచ్చాడు. మరోపక్క అతని కూతురు ఇరా ఖాన్ కూడా తన పర్సనల్ జిమ్ ట్రైనర్ తో డేటింగ్ చేస్తూ రొమాంటిక్ ఫోటోలు షేర్ చేస్తూ వచ్చింది. అయితే ఇరా ఖాన్‌.. తన ఫిట్ నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది. నవంబర్ 18, 2022 న కిరణ్ రావు, ఇమ్రాన్ ఖాన్ వంటి కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి.

ఇక జనవరి 3, 2024 లో వీరి పెళ్లి జరగబోతున్నట్టు తెలుస్తుంది. ‘ నుపుర్‌ చాలా అందగాడు.. నా కొడుకు లాంటి వాడు’ అంటూ ఆమిర్ ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.’ఇరా ఖాన్ డిప్రెషన్లో ఉన్న టైంలో నుపుర్ ఆమెకి అండగా నిలబడ్డాడని కూడా ఆయన తెలిపాడు. తన కూతురికి ఇంత మంచి భర్త దొరికితే తండ్రిగా తనకింతకంటే ఏం కావాలి?’ అని కూడా ఆమిర్ (Aamir Khan) చెప్పుకొచ్చాడు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus