దర్శకుడు లోకేష్ కనగరాజ్ సినిమా అంటే ఆడియన్స్ కి గట్టి నమ్మకం ఏర్పడింది. ‘ఖైదీ’ తో లోకేష్ మాస్ ఆడియన్స్ ను బాగా ఇంప్రెస్ చేశాడు. ఆ తర్వాత విజయ్ వంటి స్టార్ హీరో వచ్చి ‘మాస్టర్’ చేయడానికి కారణం అదే. తక్కువ టైంలోనే ఆ సినిమాని కంప్లీట్ చేయడంతో స్టార్ హీరోలు లోకేష్ కనగరాజ్ పనితనం చూసి ఇంప్రెస్ అయిపోయారు. నిర్మాతకి మాస్టర్ మంచి ప్రాఫిట్స్ మిగిల్చింది.
అందుకే కమల్ హాసన్ వచ్చి ‘విక్రమ్’ చేశాడు. అది సూపర్ సక్సెస్ అందుకుంది. బిజినెస్, కలెక్షన్స్ సంగతి పక్కన పెడితే లోకేష్ కనగరాజ్ సినిమాల్లో ప్రతి పాత్రకు ఓ మంచి ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ప్రతి పాత్ర ఆడియన్ కి అలా గుర్తుండి పోతుంది అనే చెప్పాలి. అందుకే లోకేష్ సినిమాలు కూడా ప్రత్యేకంగా నిలుస్తాయి.
ఇదిలా ఉండగా.. ‘విక్రమ్’ సినిమాలో సూర్య కేమియో చాలా స్పెషల్ గా ఉంటుంది. సినిమా ఆరంభం నుండి కమల్ హాసన్, ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ ఏ రేంజ్లో పెర్ఫార్మ్ చేసినా.. క్లైమాక్స్ లో రోలెక్స్ గా ఎంట్రీ ఇచ్చి సూర్య ఫుల్ మర్క్స్ కొట్టేశాడు అనేది వాస్తవం. అందుకే ‘విక్రమ్’ సీక్వెల్ పై కూడా ఆసక్తి పెరిగింది. మరోవైపు రజినీకాంత్ తో లోకేష్ చేసిన ‘కూలీ’ సినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ముఖ్యంగా ఇందులో ఆమిర్ ఖాన్ దాహ అనే గెస్ట్ రోల్ చేస్తున్నాడు అంటే.. ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి అని కూడా చెప్పాలి. కానీ ఆగస్టు 14న రిలీజ్ అయిన ‘కూలి’ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ సంగతి పక్కన పెడితే.. అమిర్ ఖాన్ పోషించిన దాహ పాత్ర అంచనాలు అందుకోలేదు. అసలు కథకి సంబంధం ఉన్నట్టు కూడా అనిపించదు. ల్యాగ్ అనిపించింది. అలాగే పబ్లిసిటీ కోసం మాత్రమే ఆమిర్ ని కూలీలో భాగం చేశారు అనిపిస్తుంది. ఇలా ‘విక్రమ్’ లో సూర్య పోషించిన రోలెక్స్ రోల్ ను ‘కూలీ’ లో ఆమిర్ పోషించిన దాహా రోల్ మ్యాచ్ చేయలేదు అనే చెప్పాలి.