యాక్షన్ హీరో గోపీచంద్- నయనతార కాంబినేషన్లో బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. ‘జయబాలజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్’ బ్యానర్ పై తాండ్ర రమేష్ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ నిజానికి 2011 లో మొదలైంది. అప్పటి నుండీ మూలనపడి ఉన్న ఈ చిత్రాన్ని 2017 లో రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు.కానీ ఆర్ధిక లావాదేవీల కారణంగా అప్పుడు చేయలేకపోయారు. అయితే ఎట్టకేలకు 2021 అక్టోబర్ 8న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేశారు. పాత సినిమా కావడం పైగా పోటీగా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్
‘కొండపొలం’,శివకార్తికేయన్ ల ‘డాక్టర్ వరుణ్’ వంటి సినిమాలు ఉండడంతో జనాలు ‘ఆరడుగుల బుల్లెట్’ ను పెద్దగా పట్టించుకోలేదు. థియేటర్లలో ఈ చిత్రం రూ.2 కోట్ల షేర్ ను కూడా వసూల్ చేయలేదు. అయితే గతవారం ఈ చిత్రాన్ని చాలా సైలెంట్ గా అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో విడుదల చేశారు. ఇక్కడ మాత్రం ‘ఆరడుగుల బుల్లెట్’ సక్సెస్ అయ్యింది. గత వారం, పది రోజుల నుండీ ఓటిటిలో పెద్ద సినిమా రిలీజ్ కాకపోవడంతో ఈ చిత్రాన్ని బాగానే వీక్షించారు ప్రేక్షకులు.
దాంతో 10 రోజులుగా టాప్ 2 లో ట్రెండ్ అవుతుంది ఈ చిత్రం. అందుతున్న సమాచారం ప్రకారం… ‘ఆరడుగుల బుల్లెట్’ ను రూ.4.5 కోట్లకి థియేట్రికల్ రిలీజ్ కంటే ముందే అమెజాన్ వారికి ఇచ్చేసారు నిర్మాతలు. వారం రోజుల్లోనే అమెజాన్ వారికి పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చేయడమే కాకుండా వ్యూయర్ షిప్ ను బట్టి లాభాలు కూడా దక్కాయట. కాకపోతే నిర్మాతలకి వ్యూయర్ షిప్ లో షేర్ వంటిది లేదట.