Aarthi Agarwal: ఆర్తి కెరీర్ పతనానికి ఆమె తండ్రే కారణమా..?
- April 21, 2021 / 02:37 PM ISTByFilmy Focus
విక్టరీ వెంకటేష్ హీరోగా విజయభాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో టాలీవుడ్ కు ఆర్తి అగర్వాల్ పరిచయమయ్యారు. నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందిన ఆర్తి అగర్వాల్ తరువాత కాలంలో స్టార్ హీరోల సినిమాల్లో వరుస ఆఫర్లు రావడంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ఒకవైపు సీనియర్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు యంగ్ హీరోల సినిమాల్లో సైతం ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించడం గమనార్హం.
అయితే కెరీర్ తొలినాళ్లలో బాగానే విజయాలను అందుకున్న ఆర్తి అగర్వాల్ కు తరువాత కాలంలో ఆఫర్లు తగ్గాయి. ఒక దశలో ఆమె నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ప్రముఖ నిర్మాతలలో ఒకరైన చంటి అడ్డాల ఆర్తి అగర్వాల్ ఫేడౌట్ అవ్వడానికి ఆమె తల్లిదండ్రులే కారణమని చెప్పారు. ఆర్తి హీరోయిన్ గా నటించిన అల్లరి రాముడు, అడవి రాముడు సినిమాలను చంటి అడ్డాల నిర్మించారు. ఆర్తి అగర్వాల్ వాళ్ల తల్లిదండ్రులపై పూర్తిగా డిపెండ్ అయ్యారని తల్లిదండ్రుల్ ఏం చెబితే ఆ పని చేసేవారని చంటి అడ్డాల అన్నారు.

పేరెంట్స్ వచ్చారంటే ఆర్తి అగర్వాల్ కన్వినెంట్ గా పని చేసేవారు కాదని ఆర్తి అగర్వాల్ కు ఆమె తండ్రి వల్లే సమస్య అని చంటి అడ్డాల పేర్కొన్నారు. ఒక సన్నివేశం షూటింగ్ సమయంలో జ్వరంతో బాధ పడుతున్నా ఆర్తి అగర్వాల్ షూటింగ్ లో పాల్గొన్నారని ఆమె తండ్రి షూటింగ్ కు వచ్చి ఉంటే మాత్రం షూటింగ్ కు అడ్డుపడేవారని చంటి అడ్డాల వెల్లడించారు.
Most Recommended Video
‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!












