Radhe Shyam Songs: ఆషికీ ఆగయి అంటున్న రాధే శ్యామ్.. సెకండ్ సాంగ్ కూడా హిట్టే..!

జిల్ ఫేమ్ రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం రాధే శ్యామ్. పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్, ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సినిమా పై అప్పటి వరకు ఉన్న అంచనాలను డబుల్ చేసాయనే చెప్పాలి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి రెండో పాటని కూడా విడుదల చేశారు మేకర్స్.

ఆషికి ఆగయి అంటూ సాగే ఈ పాట ఎంతో ఆహ్లాదకరంగా సాగింది. పూజా హెగ్డే , ప్రభాస్ ల మధ్య సాగే రొమాంటిక్ నంబర్ ఇదని స్పష్టమవుతుంది.వీడియో సాంగ్ రూపంలోనే దీనిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.విజువల్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. రొమాంటిక్ అండ్ యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో నిండి ఉన్న ఈ పాట కూడా చార్ట్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ విక్రమాదిత్య అనే పాత్రలో కనిపించనున్నాడు.

మరో పాత్ర కూడా ఉంది కానీ దానికి సంబంధించి మేకర్స్ ఇంకా ఏ హింట్ ఇవ్వలేదు. పామిస్ట్ విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ కనిపించనున్నాడు. కొన్ని షాట్స్ చూస్తుంటే హీరోయిన్ మరణించే సన్నివేశాలు ఉన్నట్టు కూడా కనిపిస్తున్నాయి. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి ఈ పాటని మీరు కూడా ఓ లుక్కేయండి :

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!


టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus