ఆటాడుకుందాం రా అంటూ అలరిస్తున్న అక్కినేని హీరో!!

సుశాంత్, సోనమ్ జంటగా నటించిన చిత్రం ‘ఆటాడుకుందాం..రా’. సుశాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను నాగార్జున తన ట్విట్టర్ అక్కౌంట్ ద్వారా విడుదల చేశారు.
జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని నాగ సుశీల ఈ చిత్రాన్ని నిర్మించారు. అనూప్ రూబెన్స్ స్వర పరిచిన స్వరాలు త్వరలోనే విడుదల కానుండగా.. ఈ చిత్రం కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ టీజర్ లో సుశాంత్ డిఫరెంట్ గా, స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. బ్రహ్మానందం, ఝాన్సీల కామెడీ టైమింగ్ కూడా బాగుంది.
చూస్తుంటే.. “ఆటాడుకుందాం రా”తో సుశాంత్ యువకథానాయకుల రేస్ లో నిలిచేలా ఉన్నాడు!

https://www.youtube.com/watch?v=NKJbP84B0Tc

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus