AAY: ‘ఆయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

ఎన్టీఆర్ (Jr NTR) బావమరిది నార్నె నితిన్ (Narne Nithin)  హీరోగా ‘మ్యాడ్’ (MAD) అనే సినిమా వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత అతను ‘ఆయ్’ (AAY)  అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంజి కె మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ‘జిఏ2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ (Bunny Vasu)  , విద్యా కొప్పినీడి (Koppineedi Vidya) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేశాయి. గోదావరి జిల్లాల బ్యాక్ డ్రాప్లో రూపొందిన కామెడీ సినిమా కాబట్టి.. యూత్ ఈ చిత్రం పై ఫోకస్ పెట్టారు.

AAY

ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కడుపుబ్బా నవ్వుకునే కామెడీ ఇందులో ఉంటుందని.. చిత్ర బృందం చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో థియేట్రికల్ బిజినెస్ కూడా బాగానే జరిగినట్లు వినికిడి. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :

నైజాం 1.50 cr
సీడెడ్ 0.30 cr
ఆంధ్ర 2.00 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 3.80 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.20 cr
ఓవర్సీస్ 0.10 cr
వరల్డ్ వైడ్(టోటల్) 4.10 cr

‘ఆయ్’ చిత్రానికి రూ.4.1 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమాకు పాజిటివ్ టాక్ కనుక వస్తే.. ఆ టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది.

‘తంగలాన్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus