Abhiram: దగ్గుబాటి అభిరామ్ కు కాబోయే భార్య ఆమేనా.. పెళ్లి ఎక్కడంటే?

దగ్గుబాటి హీరో అభిరామ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అహింస సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అభిరామ్ అదృష్టాన్ని పరీక్షించుకోగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. తేజ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా భారీ రేంజ్ లో కలెక్శన్లను సొంతం చేసుకునే విషయంలో ఫెయిలైంది. అయితే తాజాగా దగ్గుబాటి అభిరామ్ పెళ్లి ఫిక్స్ అయిందని తెలుస్తోంది. దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి జరగనుందనే వార్త అభిమానులకు సైతం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది.

దివంగత రామానాయుడు గారి తమ్ముడు మనవరాలిని అభిరాం పెళ్లి చేసుకోనున్నారని సమాచారం. ప్రస్తుతం దగ్గుబాటి ఫ్యామిలీ పెళ్లి హడావిడిలో ఉందని తెలుస్తోంది. సురేష్ బాబు చెల్లెలి కూతురిని అభిరామ్ వివాహం చేసుకోనున్నారు. వదువు కుటుంబం ప్రస్తుతం కారంచేడులో నివశిస్తోందని తెలుస్తోంది. అభిరామ్ కు కూడా బాల్యం నుంచి ఆ అమ్మాయి అంటే ఇష్టమని సమాచారం అందుతోంది. డిసెంబర్ నెల 6వ తేదీన వివాహం జరగనుందని శ్రీలంకలో డెస్టినేషన్ వెడ్డింగ్ గా ఈ వెడ్డింగ్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది.

పెళ్లి శుభలేఖలను కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయిస్తున్నారని సమాచారం అందుతోంది. దగ్గుబాటి ఫ్యామిలీలో పెళ్లి వేడుక అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతి త్వరలో దగ్గుబాటి ఫ్యామిలీ ఈ వివరాలను అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. త్వరలో దగ్గుబాటి అభిరామ్ ఒక కాఫీ షాప్ ను కూడా ఓపెన్ చేయనున్నారని సమాచారం అందుతోంది.

రైటర్స్ కాఫీషాప్ పేరుతో ఈ కాఫీషాప్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. సురేష్ బాబు కూతురు మాళవిక పెళ్లికి సంబంధించిన పనులను దగ్గరుండి చూసుకుంటున్నారని సమాచారం. దగ్గుబాటి అభిరామ్ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరగనుందని తెలుస్తోంది. పెళ్లి తర్వాత అభిరామ్ (Abhiram) కెరీర్ పరంగా, వ్యక్తిగత జీవితంలో సక్సెస్ కావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus