దసరా కానుకగా బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’, విజయ్ ‘లియో’, రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో ‘భగవంత్ కేసరి’ రెండు రకాలుగా సక్సెస్ అనిపించుకుంది. ‘లియో’ చిత్రానికి టాక్ బ్యాడ్ గా వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఫైనల్ గా ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా సంగతికి వస్తే.. దీనికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ…
కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. దసరా పండుగ పేరు చెప్పుకుని.. రూ.25 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. అలా అని కమర్షియల్ గా ఇది సేఫ్ మూవీ కాదు. ఫైనల్ గా ఫెయిల్యూర్ అనే చెప్పాలి. కానీ నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాత్రం.. ‘టైగర్ నాగేశ్వరరావు’ హిట్ అని చెప్పుకుంటున్నాడు. ఈ విషయం పై ఆయన (Abhishek Agarwal) మాట్లాడుతూ..” ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రాన్ని నేను ఓన్ రిలీజ్ చేసుకున్నాను.
అలాగే నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ కూడా బాగా జరిగింది. రెండు రకాలుగా ఈ సినిమా నాకు లాభాలను తెచ్చిపెట్టింది. మరి ఏ రకంగా దీనిని ప్లాప్ అంటున్నారు” అంటూ అభిషేక్ అగర్వాల్ చెబుతున్నారు. గత ఏడాది చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా విషయంలో కూడా నిర్మాత ఎన్.వి.ప్రసాద్ ఇదే విధంగా స్పందించారు. ఆ సినిమాని తాను ఓన్ రిలీజ్ చేసుకున్నట్టు.. రూ.55 కోట్ల బడ్జెట్ అయితే .. రూ.60 కోట్ల షేర్ తో తాను సేఫ్ అయిపోయినట్టు చెప్పాడు.
జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!