Abhishek Bachchan: అభిషేక్ – ఐశ్వర్య గొడవ.. ఆ ఒక్క మాటతో క్లారిటీ వచ్చేసింది!

అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) , ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai) జంట విడిపోతుందన్న పుకార్లు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారాయి. కొన్నాళ్లుగా వీరి మధ్య సన్నిహితత తగ్గిపోయిందని, ఒక్కటిగా కనిపించడం లేదని కొన్ని హిందీ మీడియా కథనాలు ప్రచారం చేశాయి. వీటిపై అభిషేక్ కానీ, ఐశ్వర్య కానీ ఎలాంటి అధికారిక క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ ఊహాగానాలు మరింత ప్రబలాయి. అయితే, ఈ రూమర్లకు చెక్ పెట్టేందుకు, వారి అనుబంధం గట్టిగానే ఉందని అభిషేక్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

Abhishek Bachchan

తాజాగా ఒక ఇంటర్వ్యూలో అభిషేక్‌ను 15 ఏళ్ల వైవాహిక జీవిత ప్రయాణం గురించి అడిగారు. దీనికి స్పందనగా అభిషేక్, ఐశ్వర్య అసాధారణమైన వ్యక్తి. ఆమె నా జీవితంలో భావోద్వేగ మద్దతు అందించే వ్యక్తి అంటూ తన భార్యపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. పరిశ్రమలో భాగస్వామిని కలిగి ఉండటం ఎంత పెద్ద అదృష్టమో వివరించాడు. ఆమె నన్నంటే ఎక్కువకాలంగా నటన రంగంలో ఉంది కాబట్టి నా కష్టాలు ఆమెకు అర్థమవుతాయి. ఇంటికి వెళ్లినప్పుడు నాకు అవసరమైన స్పేస్ లేదా మద్దతు ఆమె ఇస్తుంది అని అభిషేక్ చెప్పాడు.

అలాగే, ప్రతికూలతను ఎదుర్కోవడంలో ఐశ్వర్య విధానం తనకు ఎంతో సహాయం చేసినట్లు అభిషేక్ అన్నాడు. ఐశ్వర్య ప్రతికూలతను తనపై ప్రభావం చూపేందుకు అనుమతించదు. నేను కూడా ఆమెను చూసి ప్రతికూలతను పక్కనపెట్టడం నేర్చుకున్నాను. ఆమె ఎప్పుడూ నాకు చెప్పేది, లక్షల సానుకూల వ్యాఖ్యలపై దృష్టి పెట్టమని. ఆమె సహాయంతోనే నా దృక్పథంలో మార్పు వచ్చింది అంటూ భార్యపై ప్రశంసల జల్లు కురిపించాడు.

ఇటీవల, అభిషేక్ నిమ్రత్ కౌర్‌తో సంబంధం ఉందని, ఐశ్వర్యకు తెలిసి అనుమానం పెరిగిందని పుకార్లు వచ్చాయి. అయితే దీనికి ఎలాంటి ఆధారాలు లేవు. అంతేకాక, అనంత్ అంబానీ వివాహ వేడుకకు ఐశ్వర్య తల్లీకూతుళ్లుగా మాత్రమే హాజరుకావడం వల్ల రూమర్లు పుట్టుకొచ్చాయి. కానీ తర్వాత బచ్చన్ కుటుంబం మొత్తం కలిసి కనిపించడం ద్వారా, వారి మధ్య అనుబంధంలో ఎలాంటి బేధాలు లేవని నిరూపితమైంది.

టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నిర్మాత కన్నుమూత!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus