బిగ్ బీ కొడుకు కొనుగోలు చేసిన ఈ ఫ్లాట్స్ ఖరీదు ఎంతో తెలుసా?

  • June 21, 2024 / 11:53 AM IST

బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కొడుకు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అభిషేక్ బచ్చన్ నటుడిగా మరీ భారీ స్థాయిలో సక్సెస్ కాకపోయినా ఈ హీరోను అభిమానించే ఫ్యాన్స్ సైతం అంతకంతకూ పెరుగుతున్నారు. అభిషేక్ బచ్చన్ ఒకేసారి ఆరు ఫ్లాట్లు కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. అభిషేక్ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బిజినెస్ పై ఫోకస్ పెట్టారు. కబడ్డీ ప్రీమియర్ లీగ్ లో సైతం అభిషేక్ బచ్చన్ కు ఒక జట్టు ఉంది.

ముంబైలోని బొరివాలి సబ్బరన్ ప్రాంతంలో ఉన్న ప్రముఖ అపార్టుమెంట్ లో అభిషేక్ ఆరు ఫ్లాట్స్ ను కొనుగోలు చేయడం గమనార్హం. 57వ అంతస్థులో ఉన్న ఫ్లాట్స్ ను అభిషేక్ బచ్చన్ కొనుగోలు చేశారు. ఆరు ఫ్లాట్స్ కోసం అభిషేక్ బచ్చన్ ఏకంగా 15 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది. ఈ ఫ్లాట్స్ లో నాలుగు ఫ్లాట్స్ ఖరీదు చెరో 3.5 కోట్ల రూపాయలు కాగా మిగతా ఫ్లాట్స్ ఖరీదు చెరో 79 లక్షల రూపాయలు అని సమాచారం అందుతోంది.

గత నెల 29వ తేదీన ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పూర్తైందని తెలుస్తోంది. అభిషేక్ బచ్చన్ బిజినెస్ లో సైతం ఊహించని స్థాయిలో లాభాలను సొంతం చేసుకోవడం గమనార్హం. అభిషేక్ సినీ కెరీర్ పై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టాలని అభిమానులు భావిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తేలిపోయింది.

అభిషేక్ బచ్చన్ అద్భుతమైన కథలతో రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకుంటారేమో చూడాల్సి ఉంది. అభిషేక్ బచ్చన్ లక్ లేకపోవడం వల్లే సినిమాల్లో సంచలన విజయాలను సొంతం చేసుకోలేదని ఫ్యాన్స్ భావిస్తారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus