సినిమా రంగానికి చెందిన వాళ్లకు ఆర్థిక ఇబ్బందులు ఉండవని చాలామంది భావిస్తారు. అయితే స్టార్ స్టేటస్ ను అందుకున్న సెలబ్రిటీలు సైతం కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ సక్సెస్ గురించి అభిమానులలో చాలామందికి తెలుసు. అయితే అమితాబ్ బచ్చన్ ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి మాత్రం చాలామందికి తెలియదు. బాక్సాఫీస్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అమితాబ్ కు 20 సంవత్సరాల క్రితం సినిమా ఆఫర్లు తగ్గాయి.
నిర్మాతగా అమితాబ్ నిర్మించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. అభిషేక్ బచ్చన్ ఒక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాలను వెల్లడించారు. తాను బోస్టన్ యూనివర్సిటీలో చదివే సమయంలో తండ్రి సినిమా ఆఫర్లు లేక అల్లాడిపోవడంతో పాటు తీవ్రమైన నష్టాల్లో మునిగిపోయి ఉన్నారని అభిషేక్ అన్నారు. తన తండ్రి సొంత ఉద్యోగుల దగ్గరే అప్పులు చేసేవారని అభిషేక్ బచ్చన్ తెలిపారు. తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఉండటంతో తన తండ్రి అలా అప్పులు చేయాల్సి వచ్చిందని అభిషేక్ వెల్లడించారు.
అదే సమయంలో అమితాబ్ బచ్చన్ కు కౌన్ బనేగా కరోనా పతి షో ఆఫర్ వచ్చింది. ఈ షో వల్ల అమితాబ్ బచ్చన్ ఆర్థికంగా స్థిరపడ్డారు. ఈ షో అమితాబ్ బచ్చన్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించడం గమనార్హం. ఈ షో ద్వారా అమితాబ్ బచ్చన్ అభిమానులకు మరింత ఎక్కువగా చేరువయ్యారు.