Abijeet: భారత్ మాతాకీ జై అంటూ వ్యవసాయం చేస్తున్న అభిజిత్.. అసలేమైందంటే?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న కంటెస్టెంట్లలో అభిజిత్ ఒకరు. అభిజిత్ ఈ షో ద్వారా అభిమానులకు మరింత దగ్గరయ్యారు. బిగ్ బాస్ షో తర్వాత అభిజిత్ కెరీర్ పరంగా బిజీ కావడం ఖాయమని అందరూ భావించగా అందుకు భిన్నంగా జరిగింది. అభిజిత్ బిగ్ బాస్ షో తర్వాత ఒక వెబ్ సిరీస్ లో నటించినా ఆ వెబ్ సిరీస్ తో ఆశించిన రేంజ్ లో పాపులారిటీ రాలేదు.

అభిజిత్ కు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా ఆ ఫోటో హాట్ టాపిక్ అవుతోంది. ట్రాక్టర్ ఎక్కి బిగ్ బాస్ అభిజిత్ వ్యవసాయం చేస్తుండగా ఆ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అభిజిత్ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియోను షేర్ చేయడం జరిగింది. భారత్ మాతాకీ జై అంటూ ట్యాగ్ తో ఈ వీడియోను అభిజిత్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఈ వీడియో నెటిజన్లకు ఎంతగానో నచ్చింది.

అభిజిత్ (Abijeet) కెరీర్ పరంగా బిజీ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. సినిమాల్లోకి అభిజిత్ రీఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అభిజిత్ డిమాండ్ చేస్తే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. భాషతో సంబంధం లేకుండా అభిజిత్ సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. అభిజిత్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది.

సినిమాలకు గ్యాప్ ఇవ్వడం వల్ల తనపై వచ్చే నెగిటివ్ కామెంట్లకు అభిజిత్ ఏ విధంగా సమాధానం ఇస్తారో చూడాల్సి ఉంది. అభిజిత్ కెరీర్ పై ఫోకస్ పెడితే సినిమాలలో కీలక పాత్రల్లో నటించే అవకాశం సైతం అభిజిత్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ కథాంశాలతో అభిజిత్ కెరీర్ పరంగా ముందడుగులు వేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో అభిజిత్ కు కెరీర్ పరంగా కోరుకున్న సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus