టాలీవుడ్ సీనియర్ నటుడు రాజీవ్ కనకాలకు పోలీస్ నోటీసులు అందడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. హయత్ నగర్ పోలీసులు రాజీవ్ కనకాలకు నోటీసులు అందజేయడం జరిగింది. పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 421 కి సంబంధించిన ఓ లిటికేషన్ కేసు అమ్మకం విషయంలో అవకతవకలు జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు వెళ్ళింది. అందుకే రాజీవ్ కు పోలీసులు… విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. నిర్మాత గుత్తా విజయ్ చౌదరికి రాజీవ్ ఈ ప్లాట్ విక్రయించినట్లు తెలుస్తుంది.
కానీ ఆ ఫ్లాట్ రాజీవ్ కు సంబంధించిన స్థలంలో లేదట. ఈ విషయం తెలుసుకోకుండా విజయ్ చౌదరి అదే ప్లాట్..ను శ్రవణ్ కుమార్ అనే వ్యక్తికి రూ. 70 లక్షలకు చేసి అమ్మినట్టు తెలుస్తుంది. అతను క్రాస్ చెక్ చేసుకోగా అసలు విషయం బయట పడినట్లు తెలుస్తుంది. దీంతో శ్రవణ్ కుమార్ హయత్‌నగర్ పోలీసులు గుత్తా విజయ్ చౌదరిపై కేసు నమోదు చేయడం జరిగిందని స్పష్టమవుతుంది.మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ కేసు నుండి రాజీవ్ బయటపడతారా? అనేది కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. విలక్షణ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న రాజీవ్ కనకాల.. ఎక్కువ సినిమాల్లో చనిపోయే పాత్రలు చేస్తారని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తూ ఉంటాయి. దీంతో ఈ మధ్య ఆఫర్లు లేకపోయినా పర్వాలేదు.. చనిపోయే పాత్రలు కాకుండా లెంగ్త్ ఉన్న పాత్రలు చేయాలని రాజీవ్ డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.