మిర్చి సినిమా నుంచి భరత్ అనే నేను సినిమా వరకు కొరటాల శివ తన సినిమాలలో ఏ సినిమాతో ప్రేక్షకులను నిరాశపరచలేదు. అయితే ఎక్కడ పొరపాటు జరిగిందో తెలీదు కానీ ఆచార్య మాత్రం ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది. ఆచార్య సినిమా పుంజుకునే అవకాశం అయితే దాదాపుగా లేదని ట్రేడ్ వర్గాలు తేల్చేశాయి. అయితే రంజాన్ సెలవు మాత్రం ఈ సినిమాకు కొంతమేర కలిసొచ్చే ఛాన్స్ ఉంది.
ఆచార్య సినిమా సౌత్ స్ట్రీమింగ్ హక్కులు ఏకంగా 60 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని బోగట్టా. థియేట్రికల్ కలెక్షన్ల వల్ల నష్టపోయినా ఆచార్య మేకర్స్ కు ఈ విధంగా బెనిఫిట్ కలగనుందని తెలుస్తోంది. ఆచార్య సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుండగా ఆచార్య ఓటీటీ రిలీజ్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది. ఆచార్య సినిమాతో కొరటాల శివ నాలుగేళ్ల శ్రమ వృథా అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి రచయితగా కూడా కొరటాల శివ ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకోవడం గమనార్హం. కొరటాల శివ ఏ కథ హిట్ అవుతుందో ఏ కథ ఫ్లాప్ అవుతుందో సులువుగానే అంచనా వేయగలరు. అయితే తొలిసారి కొరటాల శివ జడ్జిమెంట్ ఈ సినిమా విషయంలో తప్పిందనే చెప్పాలి. కొరటాల శివ తర్వాత సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చి విమర్శలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది.
Most Recommended Video
కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!