చిరంజీవి, చరణ్ హీరోలుగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆచార్య సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫలితం వల్లే కొరటాల శివ తర్వాత సినిమా అంతకంతకూ ఆలస్యమవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆచార్య రిజల్ట్ కొరటాల శివ సినీ కెరీర్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపిందనే సంగతి తెలిసిందే. అయితే ఆచార్య సినిమా బయ్యర్లకు కొన్ని ఏరియాలలో నష్టాల భర్తీ జరగగా మరికొన్ని ఏరియాలలో నష్టాల భర్తీ జరగలేదు.
అయితే తాజాగా కొరటాల శివ ఆఫీస్ కు సీడెడ్ నుంచి బయ్యర్లు, ఎగ్జిబిటర్లు చేరుకున్నారని సమాచారం. నిన్న రాత్రి నుంచి వాళ్లు అక్కడే ఉన్నారని సమాచారం అందుతోంది. సీడెడ్ లో ఆచార్య సినిమాకు ఏకంగా 15 కోట్ల రూపాయల నష్టాలు వచ్చాయని బోగట్టా. సీడెడ్ బయ్యర్ అభిషేక్ నుంచి ఆచార్య హక్కులు కొనుక్కున్న వాళ్లు దారుణంగా నష్టపోయారని సమాచారం అందుతోంది. ఆచార్య సినిమాకు సంబంధించి సీడెడ్ లో ఇప్పటివరకు ఎలాంటి నష్టాల భర్తీ జరగలేదని తెలుస్తోంది.
కొరటాల శివ నష్టాలను భర్తీ చేయకపోతే ఎగ్జిబిటర్లు మరో విధంగా ముందుకు వెళ్లనున్నారని తెలుస్తోంది. కొరటాల శివ ప్రస్తుతం కొంత మొత్తం ఇస్తానని చెప్పినా వాళ్లు అంగీకరించలేదని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. కొరటాల శివ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది. పెద్ద సినిమాల నిర్మాతలు, దర్శకులు సినిమాల బడ్జెట్ల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది. సినిమాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నిర్మాతలకు,
దర్శకులకు కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పవచ్చు. ఆచార్య సమస్యను కొరటాల శివ ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది. ఆచార్య సినిమా ఫలితం వల్ల కొరటాల శివ ఆస్తులు అమ్మేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. కొరటాల శివ తర్వాత ప్రాజెక్ట్ తో సక్సెస్ ను సొంతం చేసుకుంటారేమో చూడాల్సి ఉంది.
Most Recommended Video
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!