‘ఆచార్య’ ట్రిపుల్‌ ఫీస్ట్‌ అదుర్స్‌ కదా!

శనివారం రామ్‌చరణ్‌ పుట్టిన రోజు కాబట్టి ‘ఆచార్య’ నుండి పోస్టరో, మోషన్‌ పోస్టరో ఉంటుందని అభిమానులు ఊహించారు. దానికి తగ్గట్టే ‘ఆచార్య’ టీమ్‌ ‘సిద్ధ’ గెటప్‌ను రివీల్‌ చేసింది. అందులో ‘ఆచార్య’తో కలిపి మరీ విడుదల చేసి అభిమానులకు డబుల్‌ హ్యాపీనెస్‌ ఇచ్చింది. అయితే అక్కడితో ఆగకుండా సాయంత్రం కూడా మరో పోస్టర్‌ లాంచ్‌ చేసి ఆ డబుల్‌ని ట్రిపుల్‌గా మార్చేసింది. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

‘ఆచార్య’లో వింటేజ్‌ చిరంజీవిని చూపిస్తాం అని సినిమా మొదలైన కొత్తల్లో రామ్‌చరణ్‌ చెప్పాడు. ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి ఉన్నామని చెబుతూ ఓ పోస్టర్‌ లాంచ్‌ చేశాడు. అందులో చిరంజీవి తనదైన గ్రేస్‌ను కలగలిపి ఓ స్టెప్పేస్తూ కనిపించాడు. ‘ఖైదీ నెం. 150’లో చిరు డ్యాన్స్‌ వేసినా.. ఎక్కడో చిన్న వెలితి ఉంది… సోలో స్టెప్పులు లేవని, ఇప్పుడు ‘ఆచార్య’తో అది తీరిపోయేలా ఉంది. ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ను చిత్రబృందం ఈ నెల 31న విడుదల చేస్తోంది. ఆ విషయాన్నే సాయంత్రం విడుదల చేసి పోస్టర్‌లో చెప్పారు.

31న సాయంత్రం 4.05కు ‘లాహి లాహి… ’ అంటూ సాగే ఈ గీతాన్ని చిత్రబృందం విడుదల చేస్తుందట. పోస్టర్‌లో చిరంజీవి గ్రేస్‌ను చూసి మురిసిపోతున్న అభిమానులు మరి పాటలో చూసి ఇంకెంత ఎంజాయ్‌ చేస్తారో మరి. ఉదయం విడుదలైన పోస్టర్‌ గుర్తుంది కదా. చేతుల్లో రెండు తుపాకులతో ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపించిన చిరు, సాయంత్రం గ్రేస్‌ డ్యాన్స్‌ లుక్‌లో అదిరిపోయారు. మరో నాలుగు రోజులు ఆగండి ఇంకా వావ్‌ అనుకోవచ్చు.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus