Acharya Collections: ‘ఆచార్య’ రెండో వీకెండ్ ను కూడా వాడుకోలేకపోయింది..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న విడుదలై ప్లాప్ టాక్ ను మూటకట్టుకుంది. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి లు కలిసి నిర్మించిన ఈ చిత్రానికి రాంచరణ్ సహా నిర్మాతగా వ్యవహరించడంతో పాటు… సిద్ధ అనే పాత్రని కూడా పోషించడం జరిగింది. అతనికి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంపై అంచనాలు మొదటి నుండీ భారీగా నమోదవడంతో భారీ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.

కానీ ఆ బిజినెస్ కు తగ్గ కలెక్షన్లు అయితే బాక్సాఫీస్ వద్ద నమోదు కావడం లేదు. మొదటి వారంలో.. మొదటి రోజు తప్ప తర్వాత ఏ రోజు కూడా ఈ మూవీ డీసెంట్ కలెక్షన్లను రాబట్టలేకపోయింది.ఇక రెండో వీకెండ్ ను అయినా క్యాష్ చేసుకుంటుంది అనుకుంటే అది కూడా లేదు. ‘ఆచార్య’ 10 డేస్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :

నైజాం 10.82 cr
సీడెడ్ 5.99 cr
ఉత్తరాంధ్ర 4.66 cr
ఈస్ట్ 3.29 cr
వెస్ట్ 3.40 cr
గుంటూరు 4.17 cr
కృష్ణా 3.01 cr
నెల్లూరు 2.75 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 38.09 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.87 cr
ఓవర్సీస్ 4.98 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 45.94 cr

‘ఆచార్య’ చిత్రానికి రూ.133.2 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.134 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.45.94 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.88.06 కోట్లు షేర్ ను రాబట్టాలి. ఆ టార్గెట్ ను రీచ్ అవ్వడం ఇక అసాధ్యమే అయితే రెండో వీకెండ్ ను ఈ మూవీ క్యాష్ చేసుకుంటుంది అనుకుంటే అలా జరగలేదు. మిడ్ రేంజ్ హీరోల సినిమాలకి నమోదయ్యే కలెక్షన్లు కూడా ఈ మూవీకి రావడం లేదు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus