చిరంజీవి, చరణ్ కలిసి నటించిన ఆచార్య మూవీ థియేటర్లలో విడుదలైంది. మెగా ఫ్యాన్స్ కు ఆచార్య సినిమా నచ్చినా ఇతర ప్రేక్షకులను మాత్రం ఈ సినిమా అస్సలు నచ్చలేదు. అయితే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిందని క్లారిటీ వచ్చింది. ఈ సినిమా ఆలస్యంగానే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాతే అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది.
అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిందని సమాచారం అందుతోంది. ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమాకు బుకింగ్స్ పరవాలేదనే స్థాయిలో ఉన్నాయి. సాధారణంగా మాస్ సినిమాలకు నెగిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లకు ఢోకా ఉండదు. ఆచార్య కూడా బాగానే కలెక్షన్లను సాధిస్తుందేమో చూడాలి. సర్కారు వారి పాట సినిమా థియేటర్లలో రిలీజయ్యే వరకు ఆచార్య సినిమాకు పోటీ కూడా లేదనే సంగతి తెలిసిందే.
ఆచార్య సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఆచార్య మేకర్స్ ప్రమోషన్స్ లో వేగం పెంచితే బాగుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పుష్ప ది రైజ్ సినిమాకు కూడా ప్రేక్షకుల నుంచి నెగిటివ్ టాక్ వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద పుష్ప ది రైజ్ అద్భుతాలు చేసిందనే సంగతి తెలిసిందే. ఆచార్య కూడా అదే విధంగా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లను సాధిస్తుందేమో చూడాలి.
ఆచార్య సినిమా ముందు 135 కోట్ల రూపాయల పెద్ద టార్గెట్ ఉండగా ఆ టార్గెట్ ను ఈ సినిమా సులభంగానే సాధిస్తుందో లేదో చూడాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ సినిమా 110 కోట్ల రూపాయల మేర కలెక్షన్లను సొంతం చేసుకోవాల్సి ఉంది.
Most Recommended Video
కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!