మెగాస్టార్ చిరంజీవి అభిమానులకి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. `ఆచార్య` చిత్రం దసరాకి రావడం లేదు. మొన్నటి వరకు ఈసారి దసరా లేదా సంక్రాంతి సీజన్ లకు ఈ మూవీ ఉంటుంది అని అన్నారు. సంక్రాంతికి ఎక్కువ పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి దసరా ఫిక్స్ అని వార్తలు వినిపించాయి. దాంతో ఈసారి దసరా మాములుగా ఉండదు అని అంతా భావించారు.’మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ‘కొండపొలం’ ‘రిపబ్లిక్’ `అఖండ` ‘ఆచార్య’ వంటి సినిమాలతో బాక్సాఫీస్ కళకళలాడుతుందని.. మళ్ళీ టాలీవుడ్ కు పూర్వ వైభవం వస్తుంని అంతా అనుకున్నారు.
కానీ ‘ఆచార్య’ దసరా బరి నుండీ తప్పుకుంది అనేది తాజా సమాచారం. దీంతో జనాల్లో ఆసక్తి తగ్గిపోతుందనే చెప్పాలి. నిజం చెప్పాలంటే..`ఆచార్య` షూటింగ్ 2 పాటలు మినహా పూర్తయ్యింది.అవి కూడా వారం, పది రోజుల్లో పూర్తయిపోయే ఛాన్స్ లేకపోలేదు. అయినప్పటికీ.. దసరాకి ఈ మూవీని రిలీజ్ చేయడం లేదు దర్శకనిర్మాతలు.దానికి ఒక్కటే కారణం.. థియేటర్ల పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఖరి చూస్తుంటే ఇప్పట్లో అక్కడ నైట్ కర్ఫ్యూ ఎత్తేసేలా లేదు, అలాగే టికెట్ రేట్ల విషయంలో కూడా సానుకూలంగా స్పందించే అవకాశం కనిపించడం లేదు.
పైగా అక్కడ 3 షోలతో పెద్ద సినిమాలు రిలీజ్ చేయడం కష్టం. అందుకే ‘ఆచార్య’ టీం మరికొన్ని రోజులు వెయిట్ చేయాలని డిసైడ్ అయ్యారట. ఒకవేళ ‘సీటీమార్’ ‘అఖండ’ వంటి సినిమాలు మంచి ఫలితాల్ని సాధిస్తే ‘ఆచార్య’ టీం ఏమైనా మనసుమార్చుకుంటుందేమో చూడాలి..! ఇక ‘ఆచార్య’ చిత్రంలో చిరుతో పాటు రాంచరణ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. చిరు సరసన కాజల్, చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Most Recommended Video
బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!