ఆచార్య టీజర్: పాఠాలు కాదు.. గుణపాఠాలు చెప్పే ఆచార్య!

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఆచార్య టీజర్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. అతి తక్కువ టైమ్ లోనే ఎక్కువ వ్యూస్ ని గైన్ చేస్తూ దూసుకుపోతోంది. సైరా నర్సింహారెడ్డి లాంటి చారిత్రాత్మకమైన సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న పక్కా కమర్షియల్ సినిమా కావడంతో ఫ్యాన్స్ తో పాటుగా సినీలవర్స్ అందరిలోనూ ఆసక్తిని రేపింది ఈసినిమా. మనం టీజర్ ని ఒక్కసారి చూసినట్లయితే.., ఇతరుల కోసం జీవించే వారు దైవంతో సమానం అంటూ రామ్ చరణ్ వాయిస్ తో స్టార్ట్ అయ్యింది టీజర్. అలా జీవించేవారి జీవితాలే ప్రమాదంలో పడితే ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు.

అనేసరికి మెగాస్టార్ ఎంట్రీ కుమ్మేశాడు. ఇక కొరటాల శివ మార్క్ ఎలివేషన్స్ తో ఫైట్స్ తో టీజర్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఎర్ర కండువా వేసుకుని, పిడికిలి బిగించి మెగాస్టార్ చేతిని గాల్లో లేపే షాట్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది. కాలు పైకెత్తి రౌడీల గుండెల్లో త్రిశూలాన్ని దింపి కాళీమాతలా ఇచ్చిన స్టిల్ టీజర్లోనే హైలెట్. ఇక డోర్స్ ఓఫెన్ అయితే మెగాస్టార్ కత్తిపట్టుకుని నడుచుకుంటూ వస్తున్న షాట్, అలాగే శత్రువుని అమాంతం గాల్లోకి పైకి లేపిన షాట్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది.

లాస్ట్ లో మెగాస్టార్ తనదైన స్టైల్లో చెప్పిన డైలాగ్ అద్భుతంగా ఉంది. పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఆచార్య అంటుంటారు.. బహుశా గుణపాఠాలు చెప్తాననేమో.. అనే డైలాగ్ తో ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. ఇక సినిమాని సమ్మర్ లో తీస్కుని వస్తున్నామని టీజర్లో చెప్పింది చిత్రయూనిట్. ఓవర్ ఆల్ గా కొరటాల శివ మార్క్ డైరెక్షన్ లో మెగాస్టార్ ఎలివేషన్ షాట్స్ తో ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది ఈ టీజర్.


ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus