2000 వ సంవత్సరంలో వచ్చిన ‘కౌరవుడు’ చిత్రంతో నటుడిగా పరిచయమైన అజయ్.. అటు తర్వాత ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘ఛత్రపతి’, ‘పోకిరి’ వంటి సినిమాల్లో హీరోలకి ఫ్రెండ్ రోల్స్ చేసి హానెస్ట్ పెర్ఫార్మర్.. అనిపించుకున్నాడు అజయ్. అయితే ఇతనిలో ఓ పవర్ ఫుల్ విలన్ ఉన్నాడు అని బయటపెట్టిన చిత్రం విక్రమార్కుడు. ఆ చిత్రంలో తిట్ల అనే పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు జీవం పోయడమే కాకుండా సినిమా చూస్తున్న ప్రేక్షకులను కూడా భయపెట్టాడు అజయ్.
తెలుగు సినిమా చరిత్రలో విక్రమార్కుడు విలనిజాన్ని మరిపించే సినిమా రాలేదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆ పాత్ర అంత అద్భుతంగా పండటానికి అజయ్ చూపించిన డెడికేషన్ ఒక కారణమైతే అతని 6 అడుగుల 3 అంగుళాల కటౌట్ కూడా మరో కారణం అని చెప్పాలి. అటు తర్వాత కూడా అజయ్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. అందులో పాజిటివ్ రోల్స్ ఉన్నాయి, నెగిటివ్ రోల్స్ కూడా ఉన్నాయి.
తమిళ , కన్నడ భాషల్లో కూడా మంచి మంచి పాత్రలు పోషించాడు (Ajay) అజయ్. అయితే అతని కెరీర్లో మరో అద్భుతమైన పాత్రగా విరూపాక్ష లో చేసిన అఘోర పాత్ర నిలుస్తుందని సమాచారం. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల తర్వాత అత్యంత కీలకంగా అజయ్ పోషించిన అఘోర పాత్ర నిలుస్తుందట. ఈ పాత్ర కోసం అజయ్ చాలా కష్టపడ్డాడు.
అఘోర గెటప్ లోకి మారడానికే రోజూ గంట నలబైదు నిమిషాల వరకు కదలకుండా అజయ్ ఓపికగా కూర్చునేవాడట. ఈ పాత్రలో చాలా మిస్టరీ దాగుంటుందట. ఏప్రిల్ 21 న ‘విరూపాక్ష’ చూసిన ప్రేక్షకులు అజయ్ పాత్రపై ప్రశంసలు కురిపించడం ఖాయమనే అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాల నుండీ బలంగా వినిపిస్తున్నాయి.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!