Arjun Das: సూపర్ హిట్ రీమేక్ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇవ్వబోతున్న అర్జున్ దాస్..!

కార్తీ హీరోగా నటించిన ‘ఖైదీ’ చిత్రం తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. లోకేష్ కనగరాజన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో గ్రిప్పింగ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉంటాయి. ఇక ఈ చిత్రంలో హీరో కార్తీతో పాటు అర్జున్ దాస్ విలనిజం కూడా ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత లోకేష్ కనగరాజన్.. విజయ్ తో తెరకెక్కించిన ‘మాస్టర్’ చిత్రంలో కూడా ఇతను నటించాడు.విలన్ విజయ్ సేతుపతి దగ్గర పనిచేసే దాస్ పాత్రలో ఇతను కనిపిస్తాడు.

ఈ సినిమాలో కూడా అర్జున్ దాస్ పాత్ర బాగా పండింది. ఇప్పుడు ఇతను టాలీవుడ్ కు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. కోలీవుడ్ విలన్ టాలీవుడ్ కు హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఓ విశేషం అనే చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. మలయాళంలో ఓటిటిలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ‘కప్పెల’ మూవీని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ సంస్థ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

కథ ప్రకారం సినిమాలో ఇద్దరు హీరోలు ఉంటారు.ఓ హీరోగా ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ఫేమ్ సిద్దు జొన్నలగడ్డ ఎంపికయ్యాడు.రెండో హీరో అర్జున్ దాస్ ఎంపికైనట్టు తెలుస్తుంది.ఇక హీరోయిన్లుగా ఇద్దరు మలయాళీ ముద్దుగుమ్మలు ఎంపికైనట్టు వినికిడి. అతి త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. కొద్దిసేపటి క్రితం పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. త్రివిక్రమ్ ఈ వేడుకకి హాజరయ్యి క్లాప్ కొట్టడం విశేషం.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus