సూపర్ స్టార్స్ తో ఫోటో తీసుకున్న భరత్!
- July 28, 2017 / 11:26 AM ISTByFilmy Focus
తమిళ నటుడు భరత్ “బాయ్స్” చిత్రం ద్వారా అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అతను హీరోగా నటించిన కాదల్ (ప్రేమిస్తే ) సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత హీరోతో పాటు చిన్న చిన్న పాత్రలు పోషించారు. చాలా కాలానికి స్టార్ డైరక్టర్ దర్శకత్వంలో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న స్పైడర్ సినిమాలో భరత్ కీలక రోల్లో నటిస్తున్నారు. అయితే అది పాజిటివ్ రోలా? నెగిటివ్ రోలా? అనేది పక్కన పెడితే.. స్పైడర్ సినిమాలో తాను భాగం అయినందుకు సంతోషంగా ఉన్నారు.
సూపర్ స్టార్ మహేష్ తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని భరత్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు మురుగదాస్, మహేష్ బాబు తో కలిసి తీయించుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన రోల్ గురించి వెల్లడించడానికి నిరాకరించారు. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న థియేటర్లోకి రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















