భరత్ భార్య మరణానికి ఆ మార్పులే కారణమా?

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి.. కామెర్లతో యువ తమిళ సంగీత దర్శకుడు మరణించిన వార్త మర్చిపోకముందే.. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ తల్లి గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరారు.. ప్రముఖ బెంగాలీ నటి సోనాలి చక్రవర్తి తాజాగా కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్న ఆమె కోల్‌కతాలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సోమవారం (అక్టోబర్ 31) నాడు ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు..

ఇప్పుడు మరో ప్రముఖ నటుడి భార్య మరణ వార్తతో చిత్ర పరిశ్రమ మరోసారి ఉలిక్కి పడింది.. పాపులర్ సీరియల్ యాక్టర్ భరత్ కళ్యాణ్ భార్య ప్రియదర్శిని (43) మృతి చెందారు. కన్నడ, తమిళ భాషల్లో నటించి, దర్శకనిర్మాతగానూ గుర్తింపు తెచ్చుకున్న అలనాటి నటుడు కల్యాణ్ కుమార్ కొడుకే ఈ భరత్ కల్యాణ్. భరత్ భార్య ప్రియదర్శిని కూడా సీరియల్ ప్రేక్షకులకు పరిచయమే. భర్తతో కలిసి పలు రియాలిటీ షోల్లో పాల్గొన్నారామె.. కొన్నాళ్ల క్రితం అనారోగ్యానికి గురై కోమాలోకి వెళ్లిపోయిన ప్రియదర్శిని గత కొన్ని వారాలుగా మంచంపైనే ఉన్నారు.

ఈ క్రమంలోనే ఆరోగ్యం విషమించడంతో, సోమవారం (అక్టోబర్ 31) ఉదయం 5 గంటలకు తుదిశ్వాస విడిచారు. అయితే ఆమె మరణానికి డైట్ మార్పులే కారణమని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం ప్రియదర్శిని పలియో డైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. దీంతో సడన్‌గా జరిగిన ఈ ఆహార మార్పుల వల్ల ఆమె శరీరంలోని షుగర్ లెవల్స్ పడిపోవడం.. తర్వాత మరింత సీరియస్ కావడంతో మూడు నెలల క్రితం చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత కోమాలోకి వెళ్లారు.

2007లో వచ్చిన ‘శ్రీరంగం’ అనే తమిళ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు భరత్. ఆ తర్వాత కన్నడలో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. వెండితెరపై అవకాశాలు సన్నగిల్లడంతో సీరియల్స్‌లో సెటిలైపోయాడు. ప్రస్తుతం కలర్స్ టీవీలో ప్రసారమవుతున్న ‘జమీలా’ సీరియల్‌లో ఆయన కీలకపాత్రలో నటిస్తున్నాడు. ప్రియదర్శిని మరణంతో భరత్ కుటుంబంలో తీవ్రవిషాదం నెలకొంది.. కన్నడ, తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus