Brahmaji: నవీన్ పోలిశెట్టి నటన పై ఆసక్తికర ట్వీట్ చేసిన బ్రహ్మాజీ!

తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో బ్రహ్మాజీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈయన కమెడియన్ గా మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలలో సపోర్టింగ్ పాత్రలలోను అలాగే విలన్ పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా కెరియర్ పరంగా బ్రహ్మాజీ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక సినిమాల పరంగా తన కామెడీ పంచ్ డైలాగులతో అందరినీ నవ్వించే బ్రహ్మాజీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన పంచ్ డైలాగ్స్ ద్వారా అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు.

ఇక సోషల్ మీడియాలో బ్రహ్మాజీ (Brahmaji) చేసే పన్నీ ట్వీట్స్ అందరికీ ఎంతగానో నచ్చుతూ ఉంటాయి. ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం అభిమానులతో ముచ్చటిస్తూ ఉండే ఈయన తాజాగా నవీన్ పోలిశెట్టి గురించి చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. నవీన్ పోలిశెట్టి అనుష్క జంటగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే ప్రస్తుతం ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో స్కూల్ పిల్లల చదువుల గురించి నవీన్ పోలిశెట్టి ఇచ్చినటువంటి స్పీచ్ అందరిని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాలి అయితే ఈ సన్నివేశాన్ని బ్రహ్మాజీ ట్విట్టర్లో చూశారు. ఇలా ఈ సన్నివేషంలో నవీన్ పోలిశెట్టి నటనపై ఆయన ప్రశంసలు కురిపిస్తూ ట్విట్టర్ వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. ఇందులో భాగంగా బ్రహ్మాజీ స్పందిస్తూ.. నవీన్ పోలిశెట్టిని చూస్తుంటే నాకు భయం వేస్తుంది.

ఇక నేను రిటైర్ అయిపోతా అంటూ ఈయన ఫన్నీగా ట్వీట్ చేశారు అయితే ఈయన చేసినటువంటి ఈ ట్వీట్ పై నవీన్ పోలిశెట్టి స్పందిస్తూ మీకు పవర్ ఉంది నాకు బ్రెయిన్ ఉంది ఇద్దరం కలిస్తే అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus