Brahmaji: వైరల్ అవుతున్న బ్రహ్మాజీ పోస్ట్.. కౌంటర్ ఆయనకేనా?

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ బ్రహ్మాజీ (Brahmaji) రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఘటన చోటు చేసుకున్నా తనదైన శైలిలో రియాక్ట్ కావడంలో ముందువరసలో ఉంటారు. కొన్నిసార్లు ఆ ఘటనల గురించి డైరెక్ట్ గా రియాక్ట్ అయితే మరి కొన్నిసార్లు మాత్రం ఆ ఘటనల గురించి పరోక్షంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. తాజాగా బ్రహ్మాజీ తప్పు ఎవడు చేసినా తప్పే.. వాడు.. వీడు.. ఎవడైనా అంటూ పోస్ట్ చేయడం గమనార్హం. బ్రహ్మాజీ ఈ పోస్ట్ ఒక స్టార్ హీరోను ఉద్దేశించి చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

బ్రహ్మాజీ తన పోస్ట్ లో ” వాడు దొంగతనం చేశాడు అని చెబితే అవును అది తప్పే అనడం మానేసి మీవాడు దొంగ కాదా అంటారేంటి.. తప్పుకు అర్థం మారిపోయింది.. తప్పు ఎవడు చేసినా తప్పే.. వాడు వీడు ఎవడైనా” అంటూ బ్రహ్మాజీ పోస్ట్ లో పేర్కొన్నారు. బ్రహ్మాజీ చేసిన పోస్ట్ కు 4500కు పైగా లైక్స్ వచ్చాయి. అయితే బ్రహ్మాజీ పోస్ట్ ఒకింత గందరగోళానికి గురి చేస్తోందని కొంతమంది నెటిజన్లు చెబుతున్నారు.

రాబోయే రోజుల్లో బ్రహ్మాజీ ఈ వివాదం గురించి డైరెక్ట్ గా స్పందించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. డైరెక్ట్ గా పేర్లు ప్రస్తావిస్తే ఫ్యాన్స్ నుంచి తలనొప్పులు వచ్చే అవకాశం ఉంది కాబట్టే బ్రహ్మాజీ ఈ విధంగా ముందుజాగ్రత్త పడ్డారని కొంతమంది భావిస్తున్నారు. బ్రహ్మాజీ గతంతో పోల్చి చూస్తే తక్కువ సినిమాల్లో నటిస్తున్నా మంచి పాత్రల్లో నటిస్తున్నారు.

రవితేజ (Ravi Teja) బ్రహ్మాజీ కాంబినేషన్ ను ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారు. ఈ కాంబోలో వచ్చిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పించాయి. బ్రహ్మాజీ కామెడీ టైమింగ్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. బ్రహ్మాజీ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus