కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన ధనుష్… ఇంటి ఖరీదు ఎంతో తెలుసా?

  • February 21, 2023 / 09:00 AM IST

కోలీవుడ్ నటుడు ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఒకప్పుడు తమిళ సినిమాలకు మాత్రమే పరిమితం అయినటువంటి ఈయన ప్రస్తుతం పూర్తిస్థాయి తెలుగు సినిమాలలో కూడా నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన మొదటిసారి పూర్తిస్థాయిలో నటించిన తెలుగు చిత్రం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇలా తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలతో ధనుష్ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఈ విధంగా ధనుష్ సినిమాల గురించి పక్కన పెడితే ఈయన రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా వీరి వివాహం జరిగిన 18 సంవత్సరాలకు కొన్ని మనస్పర్ధలు కారణంగా విడిపోయారు అయితే వీరిద్దరూ విడిపోక ముందు చెన్నైలోని ఎంతో ధనవంతులు నివసించే పోయిస్ గార్డెన్లో 25 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం కొనుగోలు చేశారు. అయితే ఈ స్థలంలో తన డ్రీమ్ హౌస్ నిర్మించుకోవడం కోసం ఈయన తన భార్య ఐశ్వర్యతో కలిసి భూమి పూజ కార్యక్రమాలు చేశారు.

ఈ ఇంటి నిర్మాణాన్ని చేపట్టిన తర్వాత తన భార్య పిల్లలతో కలిసి ఇక్కడే నివసించాలనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయినప్పటికీ ధనుష్ మాత్రం తన డ్రీమ్ హౌస్ నిర్మించారు. తాజాగా ఈయన కొత్త ఇంట్లోకి అడుగుపెట్టినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే అన్ని సౌకర్యాలతో, అన్ని హంగులతో ధనుష్ ఈ ఇంటిని నిర్మించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఇంటి కోసం ఏకంగా ధనుష్ 150 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం.ఇక తన భార్యతో విడాకులు తీసుకోవడంతో ధనుష్ సైతం ఈ ఇంట్లో నివసించడానికి ఆసక్తి చూపలేదట అందుకే ఈ ఇంటిని తన తల్లిదండ్రులకు బహుమానంగా ఇచ్చినట్టు ధనుష్ సన్నిహితులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈయన నూతన ఇంటి గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

1

2

3

4

5

 

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus