Dhruva Sarja: స్నేహితుడికి ఖరీదైన కారణం కానుకగా ఇచ్చిన ధ్రువ సర్జా?

సాధారణంగా స్నేహితులు అంటే చిన్న చిన్న కానుకలు ఇచ్చుపుచ్చుకోవడం సర్వసాధారణం అయితే స్నేహితుడి కోసం ఖరీదైన కారును కానుకగా ఇచ్చి వార్తల్లో నిలిచారు కన్నడ నటుడు ధ్రువ సార్జా. కన్నడ చిత్ర పరిశ్రమకు నటుడు అర్జున్ సార్జా వారసుడిగా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా నటుడుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందడమే కాకుండా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చి ఈయన నటించినది ఆరు సినిమాలే అయినప్పటికీ ఈయనకు ఉన్న క్రేజ్ మామూలుగా లేదని చెప్పాలి.

ఇక అభిమానుల పట్ల ఎంతో ఉదార భావంతో ఉండే (Dhruva Sarja) ధ్రువ తరుచూ అభిమానులను కలుస్తూ వారితో ముచ్చటిస్తూ ఉంటారు. అయితే స్నేహితులకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే ధ్రువ సార్జా తన స్నేహితుడి కోసం ఏకంగా 53 లక్షల విలువచేసే ఖరీదైన కారును కానుకగా ఇచ్చారు. ధ్రువసార్జాకు తన మిత్రుడు అశ్విన్ అంటే ఎంతో ప్రాణం ఇద్దరు చాలా ప్రాణ స్నేహితులుగా ఉంటారు ఇక అశ్విన్ సైతం క్షణం ధ్రువను విడిచిపెట్టి ఉండలేరు.

ఏ షూటింగ్ కి వెళ్లిన ఏ కార్యక్రమానికి వెళ్లిన ఆయన వెంట ఉంటారు. అయితే తన స్నేహితుడు అశ్విన్ పుట్టినరోజు కావడంతో నటుడు ధ్రువ సార్జాఏకంగా 53 లక్షల విలువచేసే కారును తనకు బహుమతిగా ఇచ్చారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారడంతో వీరిద్దరి స్నేహబంధంపై నేటిజన్స్ పలు కామెంట్స్ చేస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus