ప్రముఖ నటుడు, రచయిత అయిన గిరీష్ కర్నాడ్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గిరీష్ నిన్న ఉదయం హఠాత్తుగా గుండె పోటు రావడంతో.. మరణించారు.కన్నడ సాహిత్యానికి కన్నడ చలనచిత్ర రంగానికి ఎన్నో సేవలు అందించినందుకు గానూ కర్నాటక విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ను ఇచ్చి గిరీష్ కర్నాడ్ ని సత్కరించింది. అంతేకాదు పద్మశ్రీ, పద్మభూషణ, జ్ఞానపీఠ వంటి ప్రతిష్టాత్మక పురస్కారాలను కూడా అందుకున్నారాయన. ఇదిలా ఉండగా… ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం భావించింది. కానీ ఇందుకు కర్నాడ్ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదట.
‘తన అంతిమ సంస్కారాలు సాదాసీదాగా నిర్వహించాలని చనిపోయేముందు కర్నాడ్ … ఆయన కుటుంబ సభ్యులను కోరాడట. అంతిమయాత్రలో అభిమానులు, పోలీసు బలగాలు కూడా వద్దన్నారట. దీంతో కర్నాడ్ నిర్ణయాన్ని గౌరవించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తరువాత కర్నాడ్ అంత్యక్రియలను ఆయన కోరుకున్నట్టుగానే కుటుంబ సభ్యులు నిర్వహించారు.